లియో తరువాత తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ 69వ సినిమా జన నాయగన్ తో రానున్నాడు .ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.రీసెంట్ గానే విజయ్ షూట్ కూడా పూర్తి చేశాడు.ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది.ఇక ఈసినిమా నుండి నిన్న విజయ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.కేవలం సింగిల్ లాంగ్వాజ్ లోనే వచ్చిన ఈ గ్లింప్స్ 24గంటల్లో యూట్యూబ్ లో 22.57మిలియన్ల వ్యూస్ తో కోలీవుడ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన గ్లింప్స్ గా రికార్డు సృష్టించింది. ఓవరాల్ గా ఆల్ టైం టాప్ 5లో చోటు సంపాదించుకుంది.ఈ జాబితాలో కన్నడ హీరో యాష్ టాక్సిక్ 36 మిలియన్ల తో మొదటి స్థానంలో ఉండగా పెద్ది 31.15 మిలియన్లు, పుష్ప 2 హిందీ 27.67 మిలియన్లు, దేవర 26.17మిలియన్ల వ్యూస్ తో తరువాతి స్థానాల్లో వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక జన నాయగన్ గ్లింప్స్ తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.గ్లింప్స్ లో విజయ్ ను పవర్ పోలీస్ ఆఫీసర్ గా చూపించాడు డైరెక్టర్ వినోత్. ఇందులో విజయ్ యంగ్ గా కనిపించాడు.ఈగ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.
జన నాయగన్ లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా బాబీ డియోల్,ప్రకాష్ రాజ్,గౌతమ్ మీనన్ ,నరైన్,ప్రియమణి,మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.కె వి ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తుంది.జనవరి 9న ఈసినిమా రిలీజ్ కానుంది.
ఇక ఈసినిమా తెలుగులో జన నాయకుడుగా విడుదలకానుంది.అయితే సంక్రాంతికి తెలుగు నుండి పెద్ద సినిమాలు వస్తున్నాయి.మరి ఈ నేపథ్యంలో జన నాయకుడు ఈపోటీని ఎంతవరకు తట్టుకొంటాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: