ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్ మోవి కుబేర నిన్న విడుదలై భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. శేఖర్ కమ్ముల ఈసినిమాను డైరెక్ట్ చేయగా SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు.ఇక ఈసినిమా హిట్ దిశగా దూసుకుపోతుండడంతో ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. కుబేర పెద్ద సూపర్ హిట్. ఆడియన్స్ , మీడియా వారికి థాంక్యూ వెరీ మచ్. సినిమా పట్ల చాలా ఆనందంగా ఉన్నాం. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని కథ విన్నప్పుడే చెప్పాను.శేఖర్ కమ్ముల గారు గ్రేట్ డైరెక్టర్. ఫ్యూచర్ లో కూడా ఆయన అన్ని సూపర్ హిట్ సినిమాలు తీస్తారు.నాగార్జున గారికి థాంక్ యూ.ఆయన చాలా సపోర్ట్ చేశారు.ఆయన సపోర్ట్ తోనే సినిమాని అనుకున్న సమయంలో రిలీజ్ చేయగలిగాం.నిన్న సెకండ్ షో చూస్తున్నప్పుడు మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈరోజు కూడా బుకింగ్స్ టెర్రిఫిక్ గా ఉన్నాయి.ఇది డే బై డే పెరుగుతూ వెళుతుంది. ఎక్కడ తగ్గదు.మీడియా, ఆడియన్స్ సపోర్టుకి థాంక్యూ వెరీ మచ్’అన్నారు.
నిర్మాత పుష్కర రామ్మోహన్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.మేము చాలా ఆనందంగా వున్నాం. శేఖర్ గారు అద్భుతమైన సినిమా ఇచ్చారు. సినిమాకి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వచ్చిం.ది ఈ క్రెడిట్ అంతా టీం అందరికీ దక్కుతుంది. నిర్మాతలుగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నాగార్జున గారికి, ధనుష్ గారికి, శేఖర్ గారికి అందరికీ థాంక్యూ. ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు’అన్నారు
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: