శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న నటించిన కుబేర నిన్న విడుదలై సూపర్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో మొదటి రోజు ఈసినిమా ఊహించని రీతిలో వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా హిట్ దిశగా దూసుకుపోతుండడంతో ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.మీడియా అందరికీ థాంక్యు. ఫస్ట్ టైం యునానిమస్ గా బ్లాక్ బస్టర్ రివ్యూలు వచ్చాయి. ఎందులోనూ 3 రేటింగ్ కి తక్కువ లేదు. అంత యునానిమస్ గా సినిమా అందరికీ నచ్చింది.నిర్మాతలు సునీల్, రామ్మోహన్ గారికి థాంక్యూ. శేఖర్ తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఉంది. సుమంత్, చైతన్య, అమల వీళ్లంతా పనిచేయడానికి ముందు నుంచే శేఖర్ తో వర్క్ చేయాలని ఉండేడి. శేఖర్ కూడా మీతో ఒక స్టైలిష్, ఫ్యామిలీ సినిమా చేయాలని వుందని చెప్తుండేవారు. ఫైనల్ గా మా కాంబినేషన్లో కుబేర వచ్చింది.ఇది బ్యూటిఫుల్ క్యారెక్టర్.నాకు ఎప్పటినుంచో ఒక కొత్త క్యారెక్టర్ చేయాలని ఉండేది.
శేఖర్ సినిమాలన్నీ చూశాను. ఆయన క్యారెక్టర్ కి అద్భుతంగా న్యాయం చేస్తారు.ఈ కథ వినగానే నాది మెయిన్ కరెక్ట్ అనిపించింది.ప్రతి పాత్ర కూడా నేను చేసిన దీపక్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది.ఈ కథ వినగానే ఇది దీపక్ కథ అనిపించింది.శేఖర్ కూడా దీన్ని అలానే చెప్పారు.దీపక్ క్యారెక్టర్ ఆర్క్ అద్భుతంగా ఉంటుంది. అది నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్ ఆర్క్స్ ఒకేలా ఉంటాయి.కానీ దీపక్ క్యారెక్టర్ లో త్రీ షేడ్స్ ఇచ్చారు. అందుకే ఈ క్యారెక్టర్ బాగా నచ్చి ఓకే చెప్పాను. నా క్యారెక్టర్ కి వచ్చిన రెస్పాన్స్ గొప్ప ఆనందం ఇచ్చింది.ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ ఈ సినిమా అన్నిట్లో కూడా హీరో ఎవరని చెప్పలేం.అందులో కథ హీరో అవన్నీ కూడా డైరెక్టర్ ఫిలిమ్స్.కుబేర కూడా అవుట్ అండ్ అవుట్ శేఖర్ కమ్ముల గారి ఫిలిం.ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు.వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్.సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: