ఆ విషయం మాకు తెలియక కాదు – డైరెక్టర్ శేఖర్ కమ్ముల

sekhar-kammula-talks-about-kuberaa-at-the-grand-success-meet-in-hyderabad

ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా కుబేర. శేఖర్ కమ్ముల తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా కమర్షియల్ ఫార్మాట్ లో ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.ఇక నిన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.ఈసందర్భంగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఇందులో డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..అందరికి నమస్కారం.చాలా ఎమోషనల్ గా ఉంది.ఈ సినిమా కథ పుట్టినప్పటినుంచి చాలా డిఫరెంట్ గా చేద్దాం, హాలీవుడ్ స్థాయిలో తీద్దాం, రియల్ లొకేషన్స్ లో చేద్దాం, ముంబైని కొత్తగా చూపిద్దామని ఆశ.నాగార్జున గారి దగ్గరికి అదే ఆశతో వెళ్ళాము.చాలా డిఫరెంట్ గా తీద్దామని అని ఆయనకి చెప్పాను.ఆయనకి చాలా నచ్చింది. ఆయన అద్భుతంగా చేశారు. ఈ జర్నీలో మాకు ఆయన ఎంతో ధైర్యాన్ని నింపి ముందుకు నడిపారు.అలాగే ధనుష్ గారు కూడా.ఇది సామాన్యమైన సినిమా కాదు.సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా అని ప్రీరీలీజ్ ఈవెంట్లో చెప్పాను.అది ఈరోజు నిజమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేను చేసిన సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, హానెస్ట్, ట్రూ ఫిలిం.ఇంత కొత్తగా జెన్యూన్ గా సినిమా తీసినప్పుడు ఇందులో చాలా లేయర్స్ చెప్పడానికి ప్రయత్నించాను.ఆ క్రమంలో కాస్త లెంత్ ఉండవచ్చు.ఈ సినిమాని మీరు మరోసారి చూసినప్పుడు మీకు తెలియని లేయర్స్ కూడా కొత్తగా కనిపిస్తాయి.సినిమా తగ్గించాలని డైరెక్టర్ కి గాని, టీం కి గాని తెలియని విషయం కాదు.కానీ ఇది చెప్పాల్సిన విషయం. కచ్చితంగా చెప్పి తీరాలి.

ఒక పాయింట్ ని నిజాయితీగా చెప్పడమే మా ధర్మం.ఇప్పుడు మీరు ఇచ్చిన యునానిమిస్ రిపోర్ట్ తో చాలా ప్రౌడ్ గా ఉంది.ఈ స్థాయి మీరు ఇచ్చారని భావిస్తున్నాను.ఈ సినిమాకి గొప్ప స్థాయి ఇచ్చిన మీడియా కి, ప్రేక్షకులకు ధన్యవాదాలు.నాగార్జున, ధనుష్ గారి పర్ఫార్మెన్స్ కి థియేటర్స్ లో వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది.చాలా మంచి టేకింగ్.. డైరెక్షన్..ప్రొడక్షన్..అన్నిటి గురించి ప్రేక్షకులు చాలా గొప్పగా మాట్లాడుతున్నప్పుడు చాలా గర్వంగా ఆనందంగా అనిపిస్తోంది. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. ఇది ఒక కంప్లీట్ ఫిలిం అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.