గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ బృందానికి థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఆమె అక్కడి జూ లోని ఒక ఆడ పులికి తమ కుమార్తె పేరు ‘క్లిన్ కార’ అని పెట్టిన సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. దీనికి క్లిన్ కారతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. కాగా నేడు మెగా ప్రిన్స్ జన్మదినం అన్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఉపాసన ఎక్స్ వేదికగా.. “ఒక సంవత్సరం క్రితం, అది కేవలం ఒక చిన్న పులి పిల్ల. నేడు, అది మా కుమార్తె పేరు మీద క్లింకార అనే ఉల్లాసభరితమైన పులి. ఈ అందమైన సంజ్ఞకు హైదరాబాద్ జూకు ధన్యవాదాలు. వన్యప్రాణులు అడవిలోనే ఉన్నాయని మేము నమ్ముతున్నాము, కానీ జంతువులను గౌరవంగా మరియు జాగ్రత్తగా గౌరవించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నాము.” అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఉపాసన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇక నేడు మెగా ప్రిన్స్ జన్మదినం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని పులి పిల్లలను ఉపాసన దత్తత తీసుకున్నారు. కుమార్తె క్లిన్ కారతో కలిసి జూను సందర్శించిన ఆమె, అక్కడ వివిధ జంతువుల ఎన్‌క్లోజర్స్‌ను వీక్షించారు. ఈ క్రమంలో జూపార్క్ డైరెక్టర్ డా. సునీల్ ఎస్. హిరేమత్‌ను కలిసి పులి పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఆ పిల్లల పోషణ నిమిత్తం చెక్కు రూపంలో పెద్ద మొత్తాన్ని ఆయనకు అందజేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: