కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘కుబేర’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కుబేర నేడు ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ క్రమంలో ఈ మూవీకి మార్నింగ్ షో నుంచే అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఓవర్సీస్‌లో అయితే ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా చూసిన అభిమానులు కూడా మంచి రివ్యూలు ఇస్తున్నారు. చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి సినిమాను చూశామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకులతో కలిసి వీక్షించేందుకు హీరో ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల ఇరువురూ చెన్నైలోని ఒక థియేటర్‌కు వెళ్లారు. ఒక్కసారిగా వీరిని చూసిన అభిమానులు సర్‌ప్రైజ్ అయ్యారు. దీంతో థియేటర్‌లో సందడి నెలకొంది. ప్రస్తుతం కాగా ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: