నటీనటులు : అనంతిక సునీల్ కుమార్ ,హను రెడ్డి ,రవి దుగ్గిరాల
ఎడిటింగ్ : శశాంక్ మల్లి
సినిమాటోగ్రఫీ : విశ్వనాథ్ రెడ్డి
సంగీతం : హేషామ్ అబ్దుల్ వాహబ్
దర్శకత్వం : ఫణింద్ర నర్సెట్టి
నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మ్యాడ్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ నటి అనంతిక సనీల్‌కుమార్.ఇక ఈసినిమా తరువాత తను లీడ్ రోల్ లో నటించిన సినిమా 8 వసంతాలు.మైత్రి మూవీ మేకర్స్ నుండి వచ్చిన సినిమా కావడం అలాగే ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించడం తో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.మరి 8 వసంతాలు ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
శుద్ధి అయోధ్య (అనంతిక) రచయిత్రి.17 ఏళ్లకే పుస్తకం రాస్తుంది.ఆ బుక్ కి చదివి తనకు చాలా మంది ఫ్యాన్స్ అవుతారు.అయితే రైటింగ్ , మార్షల్ అర్స్ అంటూ బిజీగా వున్న శుద్ధికి వరుణ్ ( హను రెడ్డి) పరిచయం అవుతాడు.తనను ప్రేమించమని వెంటపడతాడు.చివరికి వరుణ్ తో శుద్ధి ప్రేమలో పడుతుంది. అయితే ఈ క్రమంలో వరుణ్ తనను కాదనుకొని విదేశాలకు వెళ్ళిపోతాడు.ఇక తొందరగానే ఇందులోనుండి బయటపడ్డ శుద్ధికి ఫ్యామిలీ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది.ఇదిలావుండగా ఊటీలో శుద్ధి రచయిత అయిన సంజయ్ (రవి దుగ్గిరాల) తో ప్రేమలో పడుతుంది.అయితే శుద్ధి తన తల్లి సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేయాల్సివస్తుంది.మరి శుద్ధి ప్రేమిస్తున్న విషయం సంజయ్ కి తెలుసా ? విదేశాల్లో వున్న వరుణ్ మళ్ళీ వచ్చాడా? ఆతరువాత ఏమైంది? అనేది మిగితా కథ.
విశ్లేషణ :
మధురం , మను తో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ ఫణింద్ర.ఈసినిమాల రిజల్ట్ పక్కన పడితే రైటర్ గా ఫణింద్ర సక్సెస్ అయ్యాడు.ఇక ఇప్పుడు ఈడైరెక్టర్ 8 వసంతాలుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.17 ఏళ్ళ శుద్ధి అయోధ్య జీవిత ప్రయాణం తరువాతి 8 సంవత్సరాలు ఎలా సాగింది.సింపుల్ గా చెప్పాలంటే 8 వసంతాలు స్టోరీ ఇదే.అయితే దీన్ని ఫణింద్ర పూర్తిగా కవితాత్మకంగా తెరమీద తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు.అందులో దాదాపు సక్సెస్ అయ్యాడు.అయితే తనలో వున్న రైటర్ ,డైరెక్టర్ ను డామినేట్ చేశాడు.దాంతో సినిమాలో బలమైన పాత్రలను రాసుకోలేకపోయాడు.అయినా చాలా వరకు ఎంగేజ్ చేయగలిగాడు.
తన నాన్న చనిపోవడంతో రచయిత్రి అవ్వాలని డిసైడ్ అవుతుంది శుద్ధి.అక్కడి నుండి వరుణ్ తో ప్రేమలో పడడం ఆ సన్నివేశాలను ఫ్రెష్ గా అనిపించి ఎంగేజింగ్ చేస్తాయి.ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలను బాగా డీల్ చేశాడు దర్శకుడు.ఈ సీక్వెన్స్ తో సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది.ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ అనే ఫీల్ తెప్పిస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ లో శుద్ధి తన ఫ్యామిలీ బాధ్యతలను తీసుకోవడం ఆ తరువాత మరోసారి ప్రేమలో పడడం చివరికి శుద్ధి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనేది చూపెట్టారు.ముఖ్యంగా క్లైమాక్స్ ఫుల్ శాటిస్ఫై చేస్తుంది.రన్ టైం కూడా తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చే విషయం.అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారికి 8 వసంతాలు ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చెప్పలేం.ఓవరాల్ గా 8 వసంతాలు డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.ముఖ్యంగా ప్రేమికులు ఈసినిమాకు బాగా కనెక్ట్ అవుతారు.
నటీనటుల విషయానికి వస్తే శుద్ధి పాత్రలో అనంతిక చాలా బాగా చేసింది.తన కెరీర్ లో తెలుగులో రెండో సినిమాతోనే లీడ్ రోల్ అవకాశం వచ్చింది.ఈ ఛాన్స్ ను పర్ఫెక్ట్ గా వాడుకుంది.శుద్ధి అయోధ్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.చాలా అనుభవం వున్న నటిలా చేసింది.ఇక ఇందులో ఇద్దరు హీరోలు వున్నారు.హను రెడ్డి అలాగే రవి దుగ్గిరాల, వీరు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు.హను స్క్రీన్ పై బాగా కనిపించాడు.యాక్టింగ్ కూడా ఆకట్టుకుంది.రవి కూడా బాగా చేశాడు.మిగితా సపోర్టింగ్ రోల్స్ లో నటించిన నటీనటులు కూడా తమ రోల్స్ లో మెప్పించారు.
టెక్నికల్ గా కూడా సినిమా ఓకే అనిపించింది.మంచి కథను కవితాత్మకంగా చెప్పడంలో డైరెక్టర్ ఫణింద్ర సక్సెస్ అయ్యాడు.ఇక హేషామ్ సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. పాటలు వినసొంపుగా వున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్రెష్ ఫీల్ తెప్పించాయి.ఎడిటింగ్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది.విజువల్స్ క్వాలిటీ గా వున్నాయి.మైత్రి మూవీస్ ప్రొడక్షన్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏం వుంది.చిన్న సినిమా అని చూడకుండా సినిమాకు కావాల్సింది చేశారు నిర్మాతలు.
ఓవరాల్ గా ప్యూర్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ 8 వసంతాలు ఎంగేజింగ్ చేస్తూ డీసెంట్ ఎంటర్టైనర్ అనిపించుకుంది.ఇందులో అనంతిక నటన , డైలాగ్స్ , ఫస్ట్ హాఫ్ , క్లైమ్యాక్స్ ,బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.ప్రేమ కథ చిత్రాలను ఇష్టపడే వారకి ఈసినిమా బాగా నచ్చుతుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























