మంచి అంచనాల మధ్య ఈ రోజు విడుదలైన కుబేర యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుంది. ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేకుండా అందరి దగ్గరినుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం రీసెంట్ గా ఈసినిమాకే జరిగింది.ఇక మౌత్ టాక్ సూపర్ గా ఉండడంతో బుక్ మై షోలో కుబేర దుమ్ము రేపుతోంది ఈసినిమాకు గంటకు 20వేలకు పైగా టికెట్ బుకింగ్స్ తో ట్రెండింగ్ అవుతుంది.ఇప్పటివరకు దాదాపు 2 లక్షలపైగా టికెట్స్ తెగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళం లో కూడా సేమ్ టాక్ రావడంతో అక్కడ కూడా అదరగొడుతుంది. ఇక యూఎస్ లో రాంపేజ్ కొనసాగిస్తోంది. ఇప్పటికే అక్కడ హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.ఆంధ్రప్రదేశ్ లో టికెట్ హైక్ వుండడంతో మొదటి రోజు కుబేర అంచనాలకు మించి వసూళ్లను రాబట్టుకోనుంది.అన్ని భాషల్లో కలుపుకొని కుబేర 30 కోట్ల ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోనుంది.కానీ టార్గెట్ కూడా ఎక్కువగానే వుంది.అయితే కన్నప్ప వచ్చే వరకు మరో పెద్ద సినిమా లేకపోవడంతో ఈజీగా బ్రేక్ ఈవెన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.
శేఖర్ కమ్ముల ఈసినిమాను డైరెక్ట్ చేయగా ధనుష్ , నాగార్జున ,రష్మిక ప్రధాన పాత్రల్లో నటించారు ఇందులో ధనుష్ యాక్టింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సినిమాకు మరో హీరో అయ్యాడు.బీజీఎమ్ అదరగొట్టాడు.సినిమా చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో దేవిఫై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓవరాల్ గా గత కొన్ని నెలల నుండి సరైన సినిమాలు లేక వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ కుబేర వల్ల మళ్ళీ కళ కళలాడుతుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: