ఇలాంటి సినిమాని ఇప్పటివరకూ చూసి వుండరు – కుబేర డైరెక్టర్ శేఖర్ కమ్ముల

director sekhar kammula talks about kuberaa movie

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న నటించిన సినిమా కుబేర.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మించారు. మరో రెండు రోజుల్లో ఈసినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కుబేర తీయడానికి మోటివేషన్ ఏమిటి?

మోటివేషన్ అంటూ ఏం లేదు కానీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ లైన్ అనిపించింది. ఒక సూపర్ రిచ్ ప్రపంచం, ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం.. బిలినియర్ వర్సెస్ బెగ్గర్.. అది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నిజానికి ఇది కథగా చెప్పడం చాలా కష్టం. చాలా పెద్ద పాయింట్. అది మెల్లగా ఇవాల్వ్ అయిన ఒక ఎమోషనల్ థ్రిల్లర్ తయారయింది. అక్కడ నుంచి డెవలప్ చేయడం జరిగింది.తనకి ఏమీ వద్దు అనుకునే ఒక బెగ్గర్.. తనకి ప్రపంచంలో అన్ని కావాలనుకునే ఒక బిలినియర్.. వారి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటే ఎలా ఉంటుందనేది చాలా ఇంట్రెస్టింగ్.సినిమాని తెలుగు తమిళ్ రెండు భాషల్లో షూట్ చేశాం. కథపరంగా ఎలాంటి మార్పు ఉండదు కానీ లెంత్ లో ఒక నిమిషం తేడా వుంటుంది. లిప్ సింక్ పరంగా ప్రతిది విడివిడిగా తీశాం. టెక్నికల్ గా రెండు సినిమాలు తీసినట్లే. అందుకే కొంచెం టైం పట్టింది.

ఈ కథకు నాగర్జున గారే కావాలి మీరు పట్టుపట్టారని తెలిసింది?

కొన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నాగార్జున గారు చేస్తే బాగుంటుంది.ఈ క్యారెక్టర్ కి ఆయన పర్ఫెక్ట్ యాప్ట్.ఆయనని స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అయితే ఇందులో ఆయన్ని ఒక వేరే విధమైన యాక్టింగ్, మేనేజర్స్ తో క్యారెక్టర్ కి తగ్గట్టుగా చూపించడం జరిగింది. నాగార్జున గారు మనం, ఊపిరి ఇలా చాలా చిత్రాల్లో డిఫరెంట్ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ క్యారెక్టర్ లోకి ఆయన అద్భుతంగా ఇమిడిపోయారు.రష్మిక కూడా అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది. తనకి మంచి అవకాశం వస్తే నెక్స్ట్ లెవెల్ లో నటించే హీరోయిన్ తను.

కుబేర పాత్ర కోసం ధనుష్ గారిని ఎంపిక చేయడానికి కారణం?

ఈ క్యారెక్టర్ ని ఆయన తప్పితే ఎవరూ చేయలేరు.సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా ఇదే మాట చెబుతారు.అంతా అద్భుతంగా పెర్ఫాం చేశారు.అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ అనేది చిన్న మాట.ఆ క్యారెక్టర్ లో ఇంకా ఎవరిని ఊహించలేరు ఆయన సినిమా పూర్తి అయ్యేవరకూ ఆ క్యారెక్టర్ లోనే ఉంటారు. ఏదైనా సింగిల్ టేక్ లో చేసేస్తారు.

కుబేర కూడా మీ మార్క్ లోనే ఉంటుందా?

నిజానికి నా మీద ఒక మార్క్ పడింది కానీ నేను ఒక మార్కు కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు. కథకు ఏం కావాలో అదే చేశాను. అయితే ఎక్కువగా బ్లాక్ బస్టర్ ఆయన సినిమాలు మ్యూజికల్ హిట్స్, లవ్ స్టోరీలు ఉంటాయి కాబట్టి అలా ఒక ముద్ర వచ్చింది.లీడర్ సినిమా చాలా హానెస్ట్ గా చెప్పిన కథ. అందులో లవ్ స్టోరీ పెట్టాలి మంచి పాటలు పెట్టాలని అనుకోలేదు. హ్యాపీ డేస్ లో కూడా అంతే. కాలేజ్ స్టోరీ అంటే కాల్ స్టోరీ లాగే ట్రీట్ చేయడం జరిగింది. అందుకే మీకు నచ్చింది. కుబేర కూడా అంతే. ఈ కథకు కావలసింది చేశాను. మార్క్ అనేది కథ ప్రకారం ఉంటుంది. అయితే ఇలాంటి కథని ఇలా చేశారా అనే వావ్ ఫ్యాక్టర్ కుబేర చూసినప్పుడు ఆడియన్స్ లో ఉంటుంది. అందుకే ముందుగానే ఈ కంటెంట్ ఏంటనేది ట్రైలర్ టీజర్ లో క్లియర్ గా చెప్పాము. రిచ్, పూర్ మధ్య జరిగే కథని ముందుగానే ఎస్టాబ్లిష్ చేశాం.ఇది ఒక డిఫరెంట్ సినిమా. నేను ఏ సినిమా తీసిన హానెస్ట్ గానే చేస్తాను. అది ఈ సినిమాలో పదింతలు కనిపిస్తుంది.

దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ గురించి ?

దేవిశ్రీ ప్రసాద్ గారితో జర్నీ సూపర్ గా ఉంది.కమర్షియల్ గా ఆయన కింగ్. కుబేర కి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.హై ఇచ్చే చాలా మూమెంట్స్ వున్నాయి.మ్యూజిక్ చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

ఇది మీ కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా కదా ..నిర్మాతలు సపోర్టు గురించి?

ఇంత పెద్ద స్టార్ కాస్ట్, పెద్ద బడ్జెట్ నిర్మాతల వల్లే సాధ్యమైంది. నేను ఏమి అడిగినా అది కాదనకుండా ఇచ్చారు. చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు.

ఈ సినిమా ప్రాసెస్ లో ఛాలెంజింగ్ అనిపించింది ఏమిటి ?

ముంబై షూట్ చాలా డిఫికల్ట్.అక్కడ పర్మిషన్స్ రావు. చాలా కండిషన్స్ ఉంటాయి. ముంబై వాళ్లే వేరే చోట షూట్ చేసుకుంటున్నారు.అలాంటి పరిస్థితుల్లో అక్కడ షూట్ చేయడం అనేది చాలా చాలెంజింగ్ గా అనిపించింది.

ముంబై బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి కారణం ఏమిటి?

ఈ కథే ముంబై బ్యాక్ డ్రాప్ కోరుకున్నది. కథాపరంగా ముంబై తప్పనిసరి.

ఈ 25 ఇయర్స్ జర్నీ చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది?

ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఫస్ట్ సినిమా తీశాను. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చేశాను. ఈ జర్నీ అంత చూసుకున్నప్పుడు ఎమోషనల్ గా అనిపిస్తుంది. ప్రేక్షకులు చాలా ప్రేమని ఇచ్చారు. ఎప్పుడు నాపై ఒక నమ్మకాన్ని ఉంచారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. అది చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. నా సినిమాల్ని అప్రిషియేట్ చేసి ఆడియన్స్ నాకు ఒక స్థాయిని ఇచ్చారు. అంతకంటే నేను ఏం కోరుకోను.

కుబేర కి పార్ట్ 2 ఉంటుందా?

లేదండి. ఇక్కడితో అయిపోతుంది. నేను ఒక్కటి తీసినప్పటికే సరిపోతుంది.

లీడర్ కి సీక్వల్ ఉంటుందా?

అది నేను ఆలోచిస్తూ ఉంటాను. కథ నాకు క్లారిటీ ఉంది. కానీ లీడర్ తీసినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులన్నీ చాలా మారిపోయాయి. దేశం, ప్రజల్లో చాలా మార్పులు వచ్చేసాయి. థింకింగ్ మారిపోయింది.దాన్ని సరిగ్గా పట్టుకోవాలి

నెక్స్ట్ కూడా పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారా?

అలా ఏం లేదండి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా చేయాలి అని చేసింది కాదు. కథలోన ఒరిజినల్ గా ట్రూ పాన్ ఇండియా ఎక్స్పీరియన్స్ ఉంది. దేశం మొత్తం రిలేట్ అయ్యే కథ ఇది. నిజానికి పాన్ ఇండియా సినిమా చేయడం చాలా కష్టం. పాటలు డబ్బింగ్ లిరిక్స్ ఇవన్నీ చూసుకోవడం సామాన్యమైన విషయం కాదు.

నాని గారితో మీరు ఒక సినిమా అనుకున్నారని విన్నాం ?

సాలిడ్ గా అనుకోలేదు.దానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా వర్క్ చేయాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.