పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘8 వసంతాలు’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతోంది. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్‌ఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘మను’ సినిమా తర్వాత ఆరేళ్లు గ్యాప్ వచ్చింది కదా… ఇంత టైం పట్టడానికి కారణం?
- కొన్ని కథలపై వర్క్ చేశాను. అయితే ‘8 వసంతాలు’ మెయిన్ ప్రాయారిటీ.
- స్త్రీ కోణంలోకి వెళ్లి ఆ సున్నితత్వాన్ని పట్టుకోవడానికి, కథ రాయడం కంటే స్త్రీ దృక్కోణాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టింది.
- ఒక బలమైన స్త్రీ పాత్ర చుట్టూ కథను చెప్పాలని అనిపించింది.
- మా అత్తయ్యలు, ఇంట్లో, చుట్టుపక్కల చాలా బలమైన స్త్రీ పాత్రల మధ్య పెరిగాను.
- ఎప్పటినుంచో ఆ దృక్కోణం ఉంది. ఈ ఫిల్మ్‌తో ఒక పూర్ణస్థాయి తీసుకోవాలనిపించింది.
ఇంత బరువైన పాత్ర కోసం అనంతిక సనీల్ కుమార్‌ను ఎంపిక చేయడానికి కారణం?
- నేను రాసుకున్న పాత్రకు అనంతిక పర్ఫెక్ట్ యాప్ట్.
- కేవలం నటిగానే కాదు, దాదాపు 13 కళలలో ఆమెకు ప్రవేశం ఉంది.
- తనకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. తను ఈ పాత్రను ఎలా చేస్తుందో అనే డౌట్ ఎప్పుడూ లేదు.
- తను చక్కగా తెలుగు మాట్లాడుతుంది. శుద్ధి అయోధ్య పాత్రకు పూర్తి న్యాయం చేసింది.
టీజర్, ట్రైలర్‌లో వాడిన భాష, కవిత్వం ఇప్పటి జెన్‌జీ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందా?
- మేము గ్రాంధికం వాడలేదు. ‘ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం’ అని ఓ డైలాగ్ ఉంది.
- ఇందులో గమ్యం, ప్రయాణం పేర్లతో సినిమాలు వచ్చాయి. మేము కొత్తగా తీసుకొచ్చినవి ఏమీ లేవు.
- సినిమాలో రెండు పాత్రలు కూడా రచయితలే. ఆ పాత్రలు సహజసిద్ధంగా అలానే మాట్లాడుతాయి.
- భాషను బ్రతికించే శక్తి సినిమాకే ఉంది. సినిమాకి ఒక పవర్ ఉంది.
- ఎవరో ఒకరు ఆ భాష చూసి ఇష్టాన్ని పెంచుకోవచ్చు. నేను ఒక ప్రయత్నం చేశాను.
- ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎంతోమంది అభినందిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు.
‘8 వసంతాలు’ ట్రైలర్ చూసిన తర్వాత రెండు ప్రేమకథలు కనిపించాయి.. ఇవి కాకుండా ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ చెప్పబోతున్నారు?
- ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన డిగ్నిటీ కోల్పోకుండా ఉండే అమ్మాయి ప్రయాణం ఇది.
- ఎలాంటి పరిస్థితుల్లోనైనా తను నిలదొక్కుకుంటుంది. ప్రేమ రెండు దశల్లో జరుగుతుంది.
- 19 ఏళ్లలో జరిగే ప్రేమ, 27 ఏళ్ల వయసులో జరిగే ప్రేమలో తను మానసికంగా ఉన్న తేడాను చాలా సున్నితంగా ఎక్స్‌ప్లోర్ చేయాలని అనుకున్నాను.
- దానికి తోడు గురుశిష్య పరంపరను కూడా చూపించాలని అనుకున్నాను.
- అలాగే తన చుట్టుపక్కల పాత్రల నుంచీ తన క్యారెక్టర్ ఎక్స్‌ప్లోర్ చేయాలని భావించాను.
- ఆ పాత్ర ఎన్ని కష్టాలు వచ్చినా మృదుత్వాన్ని కోల్పోదు.
ఇలాంటి పాత్రలు రాసినప్పుడు మీకు స్ఫూర్తి?
- బలమైన స్త్రీ పాత్రలే స్ఫూర్తిగా ఉంటాయి. అవి ఎక్కడినుంచైనా రావచ్చు.
లొకేషన్స్ బావున్నాయి.. ఎలాంటి ప్రదేశాల్లో షూట్ చేశారు?
- కశ్మీర్, కన్యాకుమారి, ఊటీ, ఆగ్రా.. ఇలా చాలా అద్భుతమైన లోకేషన్స్‌లో షూట్ చేశాం. కథే తీసుకెళ్లింది.
- ‘మను’కి పని చేసిన విశ్వనాథ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు.
ఈ సినిమా తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నారు?
- కంప్లీట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘మను’ చేశాను.
- ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌లో ఫిల్మ్ చేశాను.
- నాకు ఈ రెండు అనుభవాలూ ఉన్నాయి.
- ఈ రెండింటి సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని, తర్వాత డిసైడ్ చేసుకుంటాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: