లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ డ్రామా థగ్ లైఫ్ కర్ణాటక విడుదలకు అడ్డంకులు తొలిగిపోయాయి.ఈసినిమా ఈనెల 5నే అక్కడ కూడా విడుదలకావాల్సివుండగా ప్రమోషన్స్ లో భాగంగా కన్నడ భాష గురించి కమల్ చేసిన వ్యాఖ్యలు అక్కడి వారికి ఆగ్రహం తెప్పించాయి.దాంతో కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఈసినిమాను బ్యాన్ చేసింది. తరువాత కమల్ హైకోర్టు ను ఆశ్రయించినా లాభం లేకుండా పోయింది.కోర్టు కూడా కమల్ ను క్షమాపణ చెప్పాలిసిందే అని సూచించింది.కానీ కమల్ అందుకు నిరాకరించడంతో కర్ణాటక లో విడుదల కాలేదు.అయితే దీనిపై థగ్ లైఫ్ మేకర్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఈరోజు తీర్పు వెలువరిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
థగ్ లైఫ్ విడుదలను అడ్డుకోవద్దని కర్ణాటకలో విడుదలచేయాల్సిందే అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అలాగే సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లు తగలబెడతాం అంటూ బెదరింపులకు దిగిన సంఘాలకు కోర్టు వార్నింగ్ ఇచ్చింది.సి బి ఎఫ్ సి నుండి సెన్సార్ అయిన సినిమాలను వేటిని అడ్డుకొనే హక్కు లేదని సినిమా విడుదలయ్యాక చూడాలా వద్దా అని నిర్ణయం ప్రజలది అని కోర్టు సూచించింది.
అయితే మిగితా భాషల్లో థగ్ లైఫ్ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మేకర్స్ థగ్ లైఫ్ ను కర్ణాటక లో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























