రాజ్‌తరుణ్‌ ద్విభాషా చిత్రంలో ప్రముఖ తమిళ నటి

Ammu Abhirami Joins Raj Tarun-Vijay Milton's Bilingual Film

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ఇప్పటికే పలువురు తారలు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘ప్రేమిస్తే’ భరత్‌, సునీల్‌, పాలడబ్బా తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు వీరి జాబితాలో ప్రముఖ తమిళ నటి అమ్ము అభిరామ్‌ చేరారు. తమిళ చిత్రలు ‘రాట్సానన్‌, అసురన్‌’ చిత్రంలో ఈమె తన అభినయంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ‘గోలీ సోడా’ ఫ్రాంఛైజీగా ప్రముఖ దర్శకుడు, కెమెరామెన్‌ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. గతంలో విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో వచ్చిన గోలీ సోడా వెబ్‌ సీరిస్‌లో కూడా అమ్ము అభిరామి మంచి పాత్రను చేశారు.

ఇది ఈ ఇద్దరి కలయికలో వస్తోన్న రెండో చిత్రం కావడం గమనార్హం. కాగా ఈ చిత్రంలో అమ్ము అభిరామి పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా, ఎమోషనల్‌గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ పాత్ర, ఇందులో ఆమె అభినయం చిత్రానికి ప్లస్‌ అవుతుందని, ఆమెలోని పలు కొత్తకోణాలు ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నామని ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.