టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా వెలుగొందుతోంది. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అచ్చ తెలుగమ్మాయి ఆ తర్వాత అగ్ర హీరోల సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. మాస్ మహారాజా రవితేజతో ‘ధమాకా’, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాలలో నటించి సక్సెస్ అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ స్టార్ హీరోయిన్ నేడు జన్మదినం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె అభిమానులు, నెటిజన్స్ విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కథానాయికగా నటిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర యూనిట్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా చిత్ర బృందం ఒక స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది.
ఈ పోస్టర్‌లో శ్రీలీల క్యూట్‌గా, సింపుల్ లుక్‌తో కనిపించింది. చేతిలో కాఫీ కప్ పట్టుకుని, బొటనవేలు కింది పెదవిపై పెట్టుకుని నిలుచున్న ఆమె లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పునఃప్రారంభం కాగా, పవన్‌తో పాటు శ్రీలీల కూడా పాల్గొంది.
ఇక ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు అరడజను సినిమాలున్నాయి. వీటిలో తెలుగే కాకుండా ఇతర భాషల చిత్రాలూ ఉన్నాయి. రవితేజ ‘మాస్ జాతర’, అక్కినేని అఖిల్ ‘లెనిన్’, తమిళంలో శివ కార్తికేయన్ ‘పరాశక్తి’, హిందీలో కార్తీక్ ఆర్యన్‌కు జోడీగా ‘ఆషిఖి 3’ వంటి చిత్రాలు ఉన్నాయి. అలాగే గాలి కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న తెలుగు, కన్నడ ద్విభాషా చిత్రం ‘జూనియర్’ సినిమాలోనూ శ్రీలీల నటిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: