స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఓ వైపు నటిగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగా మారి తీసిన తొలి చిత్రం ‘శుభం’. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె కూడా ఓ అతిథి పాత్రలో మెరిశారు. విడుదలకు ముందే రిలీజ్ చేసిన ట్రైలర్ సహా ఈ మూవీ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో మంచి అంచనాల మధ్య శుభం సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకువచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే అలరించింది. పెట్టుబడికి మించి లాభాలను కళ్లజూసింది. తద్వారా స్టార్ హీరోయిన్గా ఎన్నో సినిమాలతో సక్సెస్ అందుకున్న సమంత, ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా కూడా మొదటి సినిమాతో విజయం అందుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శుభం సినిమా నేడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కి వచ్చేసింది. సో, మూవీ లవర్స్.. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని వీక్షించే అవకాశాన్ని వినియోగించుకోండి.
కాగా శుభం సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మీ, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు నటించారు. సమంత ప్రత్యేక పాత్రలో మెరిశారు. వివేక్ సాగర్, క్లింటన్ సెరెజో సంయుక్తంగా సంగీతం సమకూర్చగా.. మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ నిర్వహించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత గ్రాండ్‌గా నిర్మించింది.
శుభం కథ:-
2000 దశకంలో అప్పుడప్పుడే పల్లెల్లోకి DTH లు వస్తోన్న కాలం. విశాఖపట్నం లోని భీమిలి ప్రాంతంలో శ్రీనివాస్ (హర్షిత్ ఆర్) కేబుల్ టీవీ నడిపిస్తుంటాడు. ఫ్రెండ్స్ (గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి) లతో సరదాగా గడుపుతుంటాడు. అయితే మరోవైపు డిష్ కుమార్ (వంశీధర్ గౌడ్) శ్రీనివాస్ వ్యాపారానికి పోటీగా గ్రామాల్లోకి DTH లను అలవాటు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో సినివాస్ తల్లిదండ్రులు సెట్ చేసిన పెళ్లి సంబంధానికి ఓకే చెప్పి శ్రీవల్లి (శ్రియా కొంతం)ని పెళ్లి చేసుకుంటాడు.
అయితే మొదటిరాత్రి రోజు సరిగ్గా 9 గంటలకి ఓ సీరియల్ చూస్తూ దయ్యం పట్టినట్టుగా ప్రవర్తిస్తుంది శ్రీవల్లి. దీంతో బెంబేలెత్తిన శ్రీనివాస్ బయటకి వచ్చి చూసేసరికి, ఈ సమస్య తనకే కాదు తన ఫ్రెండ్స్ కి కూడా జరుగుతుందని అర్ధమవుతుంది. వారి భార్యలు ఫరీదా (షాలిని కొండెపూడి), గాయత్రి (శ్రావణి లక్ష్మి)లు కూడా ఇలాగే వింతగా ప్రవర్తిస్తుంటారని తెలుసుకుంటాడు. ఆ తర్వాత వీరితోపాటు ఆ ఊరిలోని ఆడవాళ్ళంతా ఇదేమాదిరిగా వ్యవహరించడం గమనిస్తారు.
రాత్రి 9 అయ్యేసరికి టీవీలో ఈ సీరియల్ ప్రసారం అవుతుండగా.. ఆ టైమ్‌కి ఇళ్లల్లోని ఆడవాళ్లంతా వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. సంవత్సరాల తరబడి నడిచే ఈ సీరియల్‌కి భీమిలిలో ఉండే ఆడావాళ్లంతా అడిక్ట్ అయిపోతారు. ఈ క్రమంలో కొందరు క్లైమాక్స్ చూడకుండానే చనిపోతారు. దీంతో మరణించిన ముసలమ్మల ఆత్మలు సీరియల్స్ చూసే వాళ్ల ఇళ్లల్లోని మహిళల్లోకి ప్రవేశిస్తుంటాయి.
ఆ సీరియల్ చూసే టైమ్‌లో వారిని ఎవరైనా డిస్ట్రబ్ చేసినా, ఛానల్ మార్చినా, లేదా టీవీలు ఆఫ్ చేయాలని చూసినా.. మగాళ్లని ఇరగ కొడుతుంటారు ఆడవాళ్లు. దీంతో ఊరిలోని మగవాళ్ళంతా రాత్రి అయితే చాలు, బిక్కచచ్చిపోతుంటారు. ఈ తరుణంలో తమ సమస్యకు మాయ మాతా శ్రీ (సమంత) ఒక్కతే పరిష్కారం చూపగలదని ఆమెని ఆశ్రయిస్తారు మగవారు.
అయితే వీరి సమస్యకి మాయ ఎలాంటి పరిష్కారం చూపింది? ఇంతకూ ఆ సీరియల్ ఏంటి? అందులో ఏం ఉంటుంది? దయ్యాలు మహిళలను వదిలాయా లేదా? సీరియల్ వల్ల గ్రామంలో సతమతమవుతున్న వారి కాపురాలను ఏ విధంగా నిలబెట్టింది? ఆ సీరియల్‌కి ఏ విధంగా ‘శుభం’ కార్డ్ పడింది? చివరికి ఏం జరిగింది? అన్నదే మిగిలిన కథ.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























