రేపే గద్ధర్‌ అవార్డుల పండుగ.. తరలి రానున్న తారాలోకం

TGF Awards to be Held Grandly Tomorrow, CM Revanth Reddy and TFI Celebs Will Attend

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇటీవల ‘తెలంగాణ గద్ధర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014 జూన్‌ నుండి 2024 డిసెంబర్‌ 31 వరకు సెన్సారు జరుపుకుని విడుదలైన ఉత్తమ చిత్రాలకు, వాటిలో నటించి ఉత్తమ ప్రతిభను చూపిన నటీనటులకు మరియు సాంకేతిక నిపుణులకు ఈ అవార్డ్స్ అందించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్‌గా ఇందుకు సంబంధించిన విజేతల జాబితాను కూడా ప్రటించారు. జూన్‌ 14న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అపూర్వ వేడుకకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదిక కానుంది. ఈ శనివారం అంగరంగ వైభవంగా జరుగనున్న ఈ వేడుక కోసం హైటెక్స్‌ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. దాదాపు 6వేల మందికి పైగా ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రానున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు, టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు గారు ఈ వేడుకను అత్యంత ఘనంగా జరిపించడానికి భారీ ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ఈ వేడుకకి సంబంధించిన విశేషాలను వివరించారు. కాగా ఈ ప్రతిష్టాత్మక వేడుకకు తెలుగు తారాలోకమంతా తరలి రాబోతున్నారు. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. దీంతో జూన్‌ 14న హైటెక్స్‌ వేడుక తారళ తళుకులతో ప్రకాశవంతం కాబోతుంది.

ఇదిలావుంటే, కొంత విరామం తరువాత తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న గద్దర్‌ అవార్డులు అందుకోవడం పట్ల అవార్డుల విజేతలు, తెలుగు సినిమా ప్రముఖులు, తెలుగు సినిమా ప్రేక్షకులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రతిభను గుర్తించడంతో పాటు ఒక పెద్ద వేదికపై తగు రీతిలో సత్కరించబోతున్న తెలంగాణ ప్రభుత్వంపై వారు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. తెలుగు సినిమాకి సంబంధించి ఇది ఖచ్చితంగా ఒక చారిత్రిక ఘట్టం కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.