గుంటూరు కారం తరువాత ఇప్పటివరకు మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోయాడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.నిజానికి ఈసినిమా తరువాత అల్లు అర్జున్ తో సినిమా చేద్దాం అనుకున్నాడు.మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో సినిమాను ప్లాన్ చేశాడు.అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పాడు.అయితే అంతా సెట్ అనే టైం లో కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఎంట్రీ ఇచ్చాడు.అల్లు అర్జున్ ,అట్లీ తో కూడా సినిమా ఓకే చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇది చేసుకుంటూ త్రివిక్రమ్ తో సినిమా చేయడం చాలా కష్టం.ఎందుకంటే రెండు వేరు వేరు జోనర్లు.దాంతో అల్లు అర్జున్, అట్లీ సినిమాను ముందు చేయాలనీ ఫిక్స్ అయ్యాడు.చేసేదేం లేక త్రివిక్రమ్,అల్లు అర్జున్ తో తీయాల్సిన సినిమాను ఎన్టీఆర్ తో చేయడానికి రెడీ అయిపోయాడు.ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈకాంబో లో ఇంతకుముందు అరవింద సమేత వచ్చింది.ఇక ఇప్పుడు రెండో సినిమా రానుంది.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది.త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
అయితే త్రివిక్రమ్ ఈఒక్క సినిమాతోనే ఆగిపోలేదు.సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ తో కూడా సినిమా చేయనున్నాడు.తక్కువ రోజుల్లో పూర్తయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేస్తున్నాడు.ఎన్టీఆర్ ఇప్పుడప్పుడే ఫ్రీ అయ్యాలే కనిపించడం లేకపోవడంతో త్రివిక్రమ్, వెంకటేష్ తో సినిమాను ముందు స్టార్ట్ చేయనున్నాడు. ఇది కూడా హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించే ఛాన్స్ ఉంది.సో ఇప్పటివరకైతే త్రివిక్రమ్ ఈ రెండు సినిమాలకు మాత్రమే కమిట్ అయ్యాడు.దాంతో కొన్ని రోజుల క్రితం రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడని వచ్చిన వార్తలు కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: