పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రావాల్సిఉండగా వాయిదాపడింది.పోస్ట్ ప్రొడక్షన్ కాకపోవడమే ఇందుకు కారణం. అయితే ఈసినిమా రిలీజ్ డేట్స్ ఇవేనని నిన్నటి నుండి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.కొందరేమో జులై 18న రిలీజ్ కానుంది ఇంకొందరేమో ఆగస్టు 1 న రానుందని ఇలా డేట్స్ వేస్తున్నారు.ఇక ఈ విషయం నిర్మాతల వరకు వెళ్లడంతో వారు క్లారిటీ ఇచ్చారు.అవన్నీ నమ్మకండి. అతి త్వరలో ట్రైలర్ తోపాటు రిలీజ్ డేట్ చెప్పనున్నామని అని ఎక్స్ ద్వారా ప్రకటించారు.మరి రిలీజ్ కు ఏ డేట్ ఫిక్స్ చేస్తారో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో క్రిష్ ,జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈసినిమాలో నిధి అగర్వాల్ ,నోరా ఫతేహి, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.దాదాపు 250కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం నిర్మిస్తున్నారు.
ఇక పవన్ రీసెంట్ గానే ఓజీ పూర్తి చేయడంతో నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ లో షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.రేపటి నుండి ఈసినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభం కానుంది.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా శ్రీ లీల ఓ హీరోయిన్ గా నటిస్తుంది.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























