కుబేర డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

KING nagarjuna wraps his dubbing for Kuberaa

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటించిన సినిమా కుబేర.షూటింగ్ కంప్లీట్ చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఈనెల 20న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఈనెలలో వస్తున్న పెద్ద సినిమా ఇదే.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.హిట్ టాక్ వస్తే ఈజీగా 100కోట్ల మార్క్ ను దాటనుంది.ఇక నాగార్జున ఈసినిమా డబ్బింగ్ కంప్లీట్ చేశాడు.నిన్నటి వరకు అఖిల్ పెళ్లి పనుల్లో బిజీగా వున్న నాగ్ ఈ రోజు డబ్బింగ్ చెప్పేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా చెన్నై లో కుబేర ఆడియో లాంఛ్ జరుగగా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి,అమిగోస్ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.కుబేర పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది.

ఇక నాగార్జున ,కూలీ లో కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.లోకేష్ కనగరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్నాడు.ఈసినిమాలో నాగ్ పాత్ర ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 14న ఈసినిమా విడుదలకానుంది.సో నెలన్నర గ్యాప్ లో రెండు సినిమాలతో రానున్నాడు నాగార్జున.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.