రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి శ్రీ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సింగిల్.ఫుల్ రన్ లో ఈసినిమా 40కోట్ల వరకు రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఈసినిమా ఈరోజు ఓటిటిలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ సింగిల్ ను తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ , తమిళ , హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇక ఈసినిమా డిజిటల్ రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తుండగా ఈ రోజు వచ్చేసింది.దాంతో సాలిడ్ వ్యూస్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సింగిల్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు నార్త్ అమెరికాలోనూ హాఫ్ మిలియన్ కు పైగా రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.కార్తీక్ రాజు తెరకెక్కించిన ఈసినిమాలో కేతికా శర్మ ,ఇవానా హీరోయిన్లు గా నటించగా వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించాడు. శ్రీ విష్ణు , వెన్నెల కిషోర్ ల కామెడీ సినిమాలో హైలైట్ అయ్యింది.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ , కళ్యా ఫిలిమ్స్ నిర్మించాయి.
ఇక శ్రీ విష్ణు ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలతో బిజీగా వున్నాడు.ఇందులో దాదాపు అన్ని కొత్త డైరెక్టర్ల తోనే చేస్తున్నవే. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























