లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ డ్రామా రేపు థియేటర్లలో గ్రాండ్‌గా పాన్ ఇండియా రిలీజ్ కానుంది. నాయకుడు సినిమా తర్వాత దాదాపు 38 ఏళ్లకు ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడంతో థగ్ లైఫ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా కర్ణాటక లో మాత్రం రిలీజ్ కావడం లేదు.రీసెంట్ గా కన్నడ భాష గురించి కమల్ చేసిన వ్యాఖ్యలు అక్కడి వారికి ఆగ్రహం తెప్పించాయి.దాంతో కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఈసినిమాను బ్యాన్ చేసింది.తరువాత కమల్ హైకోర్టు ను ఆశ్రయించినా లాభం లేకుండా పోయింది.కోర్టు కూడా కమల్ ను క్షమాపణ చెప్పాలిసిందే అని సూచించింది.కానీ కమల్ అందుకు నిరాకరించడంతో ప్రస్తుతానికి అయితే థగ్ లైఫ్ కర్ణాటక లో విడుదలకావడం లేదు.
ఇక ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది.ఇందులో శింబు, అశోక్ సెల్వన్, త్రిష కృష్ణన్, అభిరామి లాంటి స్టార్ తారాగణం కీలక పాత్రలు పోషించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ నిర్మించింది. అడ్వాన్స్ బుకింగ్ కూడా బాగానే జరుగుతున్నాయి.హిట్ టాక్ వస్తే 40కోట్ల వరకు ఓపెనింగ్స్ రావొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























