ధనుష్ అరుదైన ఆల్‌రౌండర్ – శేఖర్ కమ్ముల

Kuberaa Director Sekhar Kammula Says, Dhanush is A Phenomenal Person

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలివుడ్ కింగ్ నాగార్జున ప్రధానపాత్రల్లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కుబేర’. జూన్ 20న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, మీడియా, చిత్ర పరిశ్రమ నుండి ప్రముఖులు హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోలు ధనుష్, నాగార్జున, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు శేఖర్ కమ్ముల, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, నిర్మాతలు సునీల్ నారంగ్, జాన్వి నారంగ్, భరత్ నారంగ్, సిమ్రాన్ నారంగ్, సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి, ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి, లిరిక్ రైటర్స్ వివేక, చంద్రబోస్, నంద కిషోర్ పాల్గొన్నారు. వారందరూ ఈ సినిమా గురించి తమ ఉత్సాహాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. “ధనుష్ అద్భుతమైన వ్యక్తి, నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గీత రచయిత, అరుదైన ఆల్‌రౌండర్. కుబేర ఒక అద్భుతమైన చిత్రం. ధనుష్, నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ మెస్మరైజింగ్ గా వుంటుంది. కుబేర బ్రిలియంట్ ఫిల్మ్. ఆడియన్స్ కి చాలా న్యూ ఎక్స్ పీరియన్స్ వుంటుంది. మూవీ టీంకు హృదయపూర్వక కృతజ్ఞతలు” తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.