ఈ సంవత్సరం తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హిస్టారికాల్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ అడ్రినలిన్-చార్జ్డ్ రైడ్ జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు ఈ చిత్రం టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన బుక్ మై షో లో 200K+ ఇంట్రెస్ట్స్ అధిగమించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్లు పెంచాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (లేదా) తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు భరత్ భూషణ్‌ని కలుసుకుని లేఖను అందజేశారు. అలాగే ఈ సినిమా స్పెషల్ షోల గురించి కూడా ఏఎం రత్నం అందులో ప్రస్తావించారు.
కాగా సినిమాల విడుదలకు సంబంధించి నిర్మాతలు అనుసరించాల్సిన విధానంపై గత నెలలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. టికెట్ రేట్స్ పెంపు మరియు బెనిఫిట్ షోల కోసం ప్రొడ్యూసర్స్ ఎవరూ వ్యక్తిగతంగా ప్రభుత్వంలోని పెద్దలను కలుసుకోవద్దని, వారు తమ అభ్యర్థనల కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లేదా మరేదైనా కౌన్సిల్ ద్వారా మాత్రమే సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలోనే నిర్మాత ఏఎం రత్నం నేడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























