భైరవం లైఫ్ లాంగ్ మెమరీ -హీరో నారా రోహిత్

nara rohith talks at Bhairavam's pre-release event

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్ లో నటించిన సినిమా భైరవం.కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ గరుడన్ రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తుంది.ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఈవెంట్ లో నారా రోహిత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.ముందుగా సురేష్ గారికి థాంక్స్ చెప్పాలి.ఇంత మంచి ప్రాజెక్టు నా దగ్గరికి తీసుకొచ్చారు.ఆరోజు చూడకపోయి ఉంటే ఒక మంచి సినిమా మిస్ అయ్యే వాడిని.మనోజ్ తో సినిమా చేయడం నాకు వెరీ మెమొరబుల్.అలాగే సాయి చేయబోతున్న సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.డైరెక్టర్ విజయ్ గారు సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు.ఆయన హార్డ్ వర్క్ స్క్రీన్ పై కనిపిస్తుంది.ఈ సినిమాతో ఆయన మంచి కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలి.మరెన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్ రాధా మోహన్ గారికి ఈ సినిమా అంటే చాలా ఫ్యాషన్. ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఆయన మరిన్ని పెద్ద పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా జరుగుతున్న సమయంలో మా ఫ్యామిలీలో ఒక విషాదం చోటుచేసుకుంది.ఆ సమయంలో ఈ టీమ్ అందరూ నాకు ఎంతగానో తోడుగా ఉన్నారు.ఈ సినిమా లైఫ్ లాంగ్ మెమరీ.సినిమా అనేది కలెక్టివ్ ఎఫర్ట్.ఈ సినిమాలో పని చేసిన అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను.మీరందరూ కూడా ఈ సినిమాని చూసి మంచి ఘనవిజయాన్ని మా అందరికీ ఇస్తారని కోరుకుంటున్నాను.అందరూ తప్పకుండా మే 30వ తారీఖున ఈ సినిమాని థియేటర్లో చూడండి.మమ్మల్ని ఆశీర్వదించండి అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.