నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన సినిమా భైరవం.తమిళ సినిమా గరుడన్ రీమేక్ గా తెరకెక్కగా ఈ నెల 30న థియేటర్లలోకి వస్తుంది.ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.సినిమా మే 30న రిలీజ్ కాబోతుంది. చాలా ఆనందంగా ఉంది.రోహిత్ గారు నేను, సాయి సొంత బ్రదర్స్ లాగే ఉన్నాం.ఈ సినిమాతో మా బంధం మరింత పెరిగింది. కలకాలం అది ఇలాగే ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను.అతిథి ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది.ఆనంది గారితో కలిసి వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. మా టీమ్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.సినిమా అనేది కులం చూడదు.మా కులం సినిమా.మా గుడి సినిమా థియేటర్.ఇక్కడ ప్రతిభ ఉన్నవాళ్లే పైకి వస్తారు.ప్రతిభ ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి.మా నిర్మాత రాధా మోహన్ గారు కూడా మేము సక్సెస్ లో ఉన్నామా? సినిమాలు చేస్తున్నామా?ఇవేవీ లెక్కలేసుకోకుండా కేవలం మమ్మల్ని నమ్మి ఈ సినిమా చేశారు.సినిమా మా తల్లి.
ఆ తల్లి అందరినీ సమానంగా చూసుకుంటుంది. డైరెక్టర్ విజయ్ గారు చాలా డెడికేషన్ తో సినిమాలు చేసే వ్యక్తి.ఒక పోస్ట్ కారణంగా ఆయనపై కొన్ని విమర్శలు వస్తున్నాయి.ఆయన మెగా అభిమాని. ఆయన పోస్టు పెట్టారో లేదో తెలియదు.మీ అందరికీ ఇబ్బంది కలిగినందుకు మా టీమ్ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను.ఈ సినిమా విజయం సాధించాలని మేమంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. మీరందరూ దీవిస్తారని కోరుకుంటున్నాను.ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.నా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచిన అభిమానులకి కృతజ్ఞతలు. భైరవం 30వ తారీఖున రిలీజ్ అవుతుంది.దుమ్ము రేపేద్దాం.లవ్ యు అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























