భైరవం మామూలుగా ఉండదు – బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sreenivas talks at Bhairavam's pre-release event

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన సినిమా భైరవం. ట్రైలర్ సినిమాకు బజ్ తీసుకొచ్చింది.తమిళ సినిమా గరుడన్ రీమేక్ గా విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు.ఈ సినిమా మే 30న రిలీజ్ అవుతుంది.ప్రమోషన్స్ లో భాగంగా నిన్న హైదరాబాద్ లో మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఈవెంట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం.ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.మీరందరూ కూడా మాకు మంచి హిట్ పడాలని కోరుకుంటున్నారు. అది మాకు తెలుస్తుంది. ఈ సినిమాల్లో పని చేసిన సాంకేతిక నిపుణులకు నటీనటులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.శ్రీ చరణ్ పాకాల గారు మ్యూజిక్ ఇరగదీశారు. మే 30న మీరందరూ సినిమా చూసి మా టీమ్ అందరిని బ్లెస్స్ చేయాలి అని కోరుకుంటున్నాను. సినిమా మీ అందరికీ ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒక మంచి సినిమా చూసామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది.ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడి ఇష్టపడి మీ అందరికీ ఒక మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో చేసాం.డైరెక్టర్ విజయ్ గారు సినిమాని చాలా కష్టపడి తీశారు.ఆయన హార్డ్ వర్క్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఈ సినిమా ఫైనల్ కట్ చూశాను. అదిరిపోయింది.మామూలుగా ఉండదు.

మే 30న మనందరికీ పెద్ద పండగ.ఆ పండగలో మీరందరూ భాగం కావాలని కోరుకుంటున్నాను.రాధా మోహన్ గారి లాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి.మనోజ్ అన్నకి రోహిత్ గారికి అతిథి,ఆనంది గారికి అలాగే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.సినిమా అద్భుతంగా ఉండబోతుంది.సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందాం.లవ్ యు ఆల్ అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.