ఆ సినిమా నుంచి నా ట్రీట్మెంట్ మారిపోయింది – మణిరత్నం

Thug Life Director Mani Ratnam Recalls Kamal Haasan's Nayakudu Movie

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-యాక్ష‌న్‌ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’. ఈ భారీ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా చెన్నైలో భారీ ఆడియో లాంచ్ ఈవెంట్ వేడుక‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్, అభిరామి, నాజ‌ర్‌, అశోక్ సెల్వ‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వి.కె.చంద్ర‌న్ స‌హా ప‌లువురు న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ.. ‘‘నేను థాంక్స్ చెప్ప‌టం ప్రారంభిస్తే కె.బాల‌చంద‌ర్ నుంచి ప్రారంభించాలి. ఎందుకంటే సినీ ఇండ‌స్ట్రీలోకి రావ‌టానికి కార‌ణం బాల‌చంద‌ర్‌గారు. త‌ర్వాత నాకు మొద‌టి సినిమా ఇచ్చిన వీన‌స్ కృష్ణ‌మూర్తిగారు, స‌త్య‌జ్యోతి త్యాగు గారికి, నిర్మాత వెంక‌టేష్‌ గారికి..ఇలా చెప్పుకుంటూ రావాలి. అయితే ఇక్క‌డ నేను ముందుగా ఇద్ద‌రికీ మాత్రం థాంక్స్ చెప్పాల‌నుకుంటున్నాను. అందులో ముందుగా ఈ ఆడియో వేడుకకి కార‌ణమైన ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ గారికి. ఆయ‌న త‌న జ‌ర్నీలో ఎంతో మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాను ఆయ‌న త‌న మ్యూజిక్‌తో నిల‌బెట్టారు.” అని చెప్పారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “క‌మ‌ల్ హాస‌న్‌గారు న‌న్ను ‘నాయ‌కుడు’ మూవీ చేయ‌మ‌న్నప్పుడు.. అంత‌కు ముందు వ‌ర‌కు నిర్మాత‌లతో యుద్ధం చేస్తూ వ‌చ్చాను. కానీ నాయ‌కుడు సినిమా నుంచి ఆ ట్రీట్మెంట్ మారిపోయింది. అంత పెద్ద బ్రేక్ ఇచ్చిన క‌మ‌ల్‌ గారికి థాంక్స్‌. అలాగే ఇప్పుడు థ‌గ్ లైఫ్ మూవీ ఇచ్చినందుకు కూడా థాంక్స్‌. 38 ఏళ్ల ముందు నాపై న‌మ్మ‌కంతో నాకు ఎలాగైతే అవ‌కాశ‌మిచ్చి న‌టించారో ఇప్పుడు కూడా అలాగే న‌టించారు. మా బెస్ట్ నేను చేశాన‌నే అనుకుంటున్నాం. ఎంటైర్ టీమ్‌కు ధ‌న్య‌వాదాలు’’ అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.