భైరవం తప్పకుండా అందరికీ నచ్చుతుంది – హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

bellamkonda sai sreenivas talks about Bhairavam

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. ఈ సినిమా మే 30న సమ్మర్ సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకి దర్శకుడిగా విజయ్ గారిని ఎంచుకోవడానికి కారణం?

నాకు కమర్షియల్ హీరోగా మంచి పేరు వచ్చింది. తర్వాత కొన్ని స్టైలిష్ సినిమాలు చేయడం జరిగింది. అప్పుడు మాస్ కనెక్ట్ అవుతున్నారా లేదా అనే ఆలోచన ఉండేది. అందరూ రిలేట్ చేసుకునే ఒక రూరల్ స్టోరీ చేయాలని ఉండేది. అలాంటి సినిమా కోసం చూస్తున్నప్పుడు ఈ కథ దొరికింది. ఈ కథని మన సెన్సిబిలిటీస్ కి తగ్గట్టు ప్రజెంట్ చేసే గల దర్శకుడు విజయ్ గారు అనిపించింది. నేను కూడా కొన్ని రీమిక్స్ చేశాను. వాటి నుంచి నేర్చుకున్నాను. రాక్షసుడు నాకు మంచి సక్సెస్ ఇచ్చిన సినిమా. భైరవం రీమేక్ లా కాకుండా స్ట్రైట్ సినిమా గానే చూడాలి. డైరెక్టర్ తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టు అన్ని మార్పులు చేసి చాలా అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దారు. ఇది అందరూ రిలేట్ అయ్యే ఎమోషన్స్ తో ఉంటుంది.

రోహిత్ గారు, మంచు మనోజ్ క్యారెక్టర్స్ గురించి?

రోహిత్ గారు మనోజ్ గారు ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ముందు రోహిత్ గారికి కలిసి ఈ క్యారెక్టర్ గురించి ఆయనకు చెప్పిన వెంటనే అంగీకరించారు. తర్వాత మిరాయ్ పోస్టర్లో మనోజ్ గారిని చూసి ఆ క్యారెక్టర్ కి మనోజ్ గారు అయితే బాగుంటుందని ఆయనని సంప్రదించాం. ఆయనకు కూడా కథ నచ్చింది. ఈ కథకి వారిద్దరూ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యారు. ఈ కథకి ఇద్దరు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు.ఈ సినిమాకి అందరూ కూడా చాలా ఫ్రెష్ కాస్టింగ్ కుదిరింది. నేను మనోజ్ గారు రోహిత్ గారు సినిమాలకి కొంతకాలంగా బ్రేక్ ఇచ్చిన వాళ్ళమే. నా సినిమా వచ్చి దాదాపు నాలుగు ఏళ్ళు అవుతుంది. అలాగే రోహిత్ గారు, మనోజ్ గారు కూడా బ్రేక్ లో ఉన్నారు. ఇందులో క్యారెక్టర్స్ ని చూస్తున్నప్పుడు తప్పకుండా అందరూ చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు.

అతిథి శంకర్ గురించి ?

అతిథి శంకర్ గారు వెరీ నైస్ పర్సన్. వెరీ ఎనర్జిటిక్. మా అందరితో కలిసిపోయింది. తను చాలా మంచి యాక్టర్ అవుతుంది. తను మంచి సింగర్, డాన్సర్. చాలా టాలెంటెడ్.

ట్రైలర్ లో ఒక పూనకం షాట్ ఉంది కదా.. దాని గురించి చెప్పండి?

నాకు మెయిన్ గా నచ్చిన పార్ట్ అది. కథలో దాన్ని చాలా అద్భుతంగా వాడడం జరిగింది. ఆ సర్ ప్రైజ్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎమోషనల్ ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇది.ఈ సినిమా ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉంటుంది. మీరు ఒకవేళ తమిళ్ లో వెర్షన్ చూసినా కూడా ఈ సినిమా మీకు చాలా నచ్చుతుంది. కేవలం ఆ సినిమా సోల్ మాత్రమే తీసుకొని తెలుగు ఆడియన్స్ కు తగ్గట్టుగా అద్భుతంగా మలచడం జరిగింది.నన్ను ఇష్టపడిన ప్రతి ఆడియన్ కోసం భైరవం సినిమా చేశాను. తప్పకుండా ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆడియన్స్ చాలా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు.

మీరు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్.. ఈ సినిమాలో డాన్స్ మూమెంట్స్ ఆశించవచ్చా?

తప్పకుండా. ఇందులో రెండు డ్యాన్స్ సాంగ్స్ ఉన్నాయి. గిచ్చమాకే సాంగ్ పర్ఫెక్ట్ ఫెస్టివల్ వైబ్ తో ఉంటుంది. అలాగే మరో డ్యాన్స్ నెంబర్ కూడా వుంది. మంచి డాన్స్ మూమెంట్స్ కుదిరాయి. శ్రీ చరణ్ పాకాల అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆర్ఆర్ ఎక్స్ట్రాడినరీ గా ఉంటుంది.చాలా కొత్త సౌండ్ ఉంటుంది.

-హరికే వేదాంత కెమెరా వర్క్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆడియన్స్ కి చాలా మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.

దాదాపు నాలుగు ఏళ్ళు గ్యాప్ వచ్చింది కదా.. ఈ గ్యాప్ లో ఎలాంటి కథల మీద వర్క్ చేశారు?

హైందవ స్క్రిప్ట్ ఓకే చేసి దాదాపు మూడేళ్లు అవుతుంది. అది నాకు చాలా పాషనేట్ ప్రాజెక్టు. హైందవ ,టైసన్ నాయుడు తర్వాత ఇంకేది చేయకూడదు అనుకున్నాను. ఈ ప్రాసెస్ లో ఉన్నప్పుడు అనుకోకుండా భైరవం, కిస్కిందపురి వచ్చాయి. ఈ రెండు ప్రాజెక్టులు కూడా నాకు చాలా ఎక్సైట్ చేశాయి. కిష్కిందపురి చాలా కొత్త జోనర్ సినిమా. ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది.

ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు ఇష్టమైన జానర్ ఏంటి?

ప్రతి సినిమాని కూడా ఎంజాయ్ చేస్తూనే చేస్తాను. ప్రతి సినిమాకి నా అటాచ్మెంట్ ఒకేలానే ఉంటుంది.

భైరవం టైటిల్ గురించి?

ఈ సినిమాలో హీరో కొలిచేది కాలభైరవుడ్ని. కథలో నుంచే ఆ టైటిల్ వచ్చింది. ఈ సినిమా కోసం మ్యాసీవ్ టెంపుల్ సెట్ వేసాం. అది చాలా రియల్ గా వచ్చింది. హ్యాట్సాఫ్ టు ఆర్ డైరెక్టర్ బ్రహ్మ కడలి గారు.

నిర్మాత రాధా మోహన్ గారి గురించి?

నాకు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్. నన్ను ఫస్ట్ నమ్మిన వ్యక్తి. ఆయనతో రెండు మూడు ప్రాజెక్టులు చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. ఈ సినిమాతో అన్ని సెట్ అయ్యాయి. చాలా పాషన్ తో సినిమా నిర్మించే ప్రొడ్యూసర్.

పూరి జగన్నాథ్ గారితో మీరు సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి ?

ఒకటి రెండుసార్లు కలిసాము. ఖచ్చితంగా ప్లాన్ చేస్తాము.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.