సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్,బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా సికందర్.మార్చి 30న విడుదలైన ఈసినిమాకు రివ్యూస్ నెగిటివ్ గా రావడంతో విజయాన్ని సాధించలేకపోయింది.బాక్సాఫీస్ వద్ద కేవలం 150 కోట్ల వసూళ్లను రాబట్టి నిరాశ మిగిల్చింది. ఇక ఈసినిమా ఓటిటిలోకి రానుంది. నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈరోజు అర్ధరాత్రి 12 గంటలనుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.అయితే కేవలం హిందీలోనే స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తుందా లేదా మిగితా భాషల్లో కూడా అందుబాటులో ఉంచుతుందా అనేది క్లారిటీ రావాల్సివుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా కాజల్ ,సత్యరాజ్ ను కీలక పాత్రలు పోషించారు.సాజిద్ నడియాడ్‌వాలా ఈసినిమాను నిర్మించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
ఇక గత కొన్నేళ్ల నుండి వరుస పరాజయాలను చూస్తున్న సల్మాన్ ఖాన్ , సికందర్ తో కూడా కం బ్యాక్ ఇవ్వలేకపోయాడు.దాంతో ఫ్యాన్స్ ఈసారి చేసే సినిమాను సరిగ్గా ప్లాన్ చేసుకొని చేయమని సల్మాన్ ను కోరుతున్నారు.మరి సల్మాన్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























