శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటిస్తున్న సినిమా కుబేర.షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. ఈసినిమా నుండి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచాలని చూస్తుంది కుబేర టీం. అందులో భాగంగా వచ్చే వారం ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనుంది.అదేంటంటే టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఇందుకోసం వెరైటీ గా కుబేర సాంకేతిక బృందం తో చిట్స్ తీయించారు. టీజర్ ,సెకండ్ సింగిల్ అని రెండు చిట్టిలను వారి ముందు ఉంచగా అందులో ఎక్కువ మందికి టీజర్ వచ్చింది. సో టీజర్ ను విడుదలచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శేఖర్ కమ్ముల తన స్టైల్ కు భిన్నంగా భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి,అమిగోస్ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.జూన్ 20న పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి .
ఇక ధనుష్ ఇంతకుముందు సార్ తో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు కుబేర తో రానున్నాడు. మరి ఈసినిమా తనకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: