బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా మే 30న వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం థియేట్రికల్ ట్రైలర్ ఏలూరులో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక చాలా సక్సెస్ ఫుల్‌గా జరిగింది. ఏపీ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పుట్ట మహేష్, ఎమ్మెల్యేలు రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. “హాయ్ ఏలూరు. భైరవం నాకు చాలా స్పెషల్ ఫిలిం. బెల్లంకొండ సురేష్ గారు ఈ సినిమాని నా దగ్గరికి తీసుకొచ్చారు. సినిమా చూశాను చాలా నచ్చింది. విజయ్ డైరెక్టర్ అనేసరికి చాలా కాన్ఫిడెంట్‌గా అనిపించింది. తను ‘ఉగ్రం, నాంది’ చిత్రాలు అద్భుతంగా తీశాడు. సాయి, మనోజ్ రెండు క్యారెక్టర్లు చేస్తున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాతో మా జర్నీ ఇంకా పెరిగింది.” అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా నాకు గుర్తుపెట్టుకునే మంచి సినిమా. నిర్మాత రాధ మోహన్ గారు చాలా అద్భుతంగా ఈ సినిమా నిర్మించారు. మా టీమ్ అందరికీ థాంక్యూ. ఈ సినిమా మీ అందరికీ నచ్చిందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మే 30 తారీఖున ఈ సినిమాని తప్పకుండా థియేటర్స్‌లో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: