చాలా గ్యాప్ తరువాత ఓజీ షూటింగ్ రీసెంట్ గానే మళ్ళీ స్టార్ట్ కాగా ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ జరుగుతుంది.ఇందులో రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ అయ్యాడు.ఇక నెక్స్ట్ షెడ్యూల్ ఈనెల 18నుండి ముంబై లో జరుగనుంది.ఈషూటింగ్ లో పవన్ దాదాపు వారం రోజులు పాల్గొననున్నాడు.ఈ షెడ్యూల్ తో 80శాతం షూటింగ్ కంప్లీట్ కానుంది.మిగితా షూటింగ్ ను కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఈఏడాది చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఇక పవన్, ఉస్తాద్ భగత్ సింగ్ కి కూడా డేట్స్ ఇచ్చినట్లు సమాచారం.జూన్ మూడో వారంలో ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కానుందట.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా శ్రీ లీల ఓ హీరోయిన్ గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.పవన్ ఈ రెండు సినిమాలను వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి పూర్తిగా రాజకీయాల్లో బిజీ కానున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: