ఉస్తాద్ రామ్ పోతినేని 22వ సినిమా టైటిల్ గ్లింప్స్ ను నిన్న రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్ లో 11 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని మొదటి స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఓవరాల్ గా ఇప్పటివరకు 14 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.ఓ మిడ్ రేంజ్ హీరో సినిమా గ్లింప్స్ కి ఈ రేంజ్ వ్యూస్ అంటే సినిమాకు భారీ హైప్ వచ్చినట్లే.ఇక ఈసినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ ఖరారు చేశారు.గ్లింప్స్ కి కూడా యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.రెగ్యులర్ స్టయిల్ కు భిన్నంగా రామ్ ఈసినిమా చేస్తున్నాడు.ఇందులో తన లుక్ కూడా ఫ్రెష్ గా వుంది.ఆంధ్ర కింగ్ గా కన్నడ స్టార్ ఉపేంద్ర కనిపించనుండగా అతనికి వీరాభిమాని గా సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా షూటింగ్ కూడా సగానికి పైగా కంప్లీట్ అయ్యింది.జులై లోపు బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.త్వరలోనే ఫస్ట్ సింగల్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.
ఇక రామ్ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమాలు అనుకున్నంతగా విజయాన్ని సాధించలేకపోయాయి.దాంతో ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ కెరీర్ కు కీలకం కానుంది. మరి ఈసినిమాతో సక్సెస్ కొట్టి రామ్ ఫామ్ లోకి వస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: