ఎట్టకేలకు వార్ 2 నుండి ఓ అప్డేట్ రానుంది.బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ లతో మల్టీ స్టారర్ గా వార్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా స్టార్ట్ అయిన దగ్గరి నుండి ఫినిష్ అయ్యే వరకు ఒక్క రిలీజ్ డేట్ తప్ప మరో అప్డేట్ అంటూ ఇవ్వలేదు.కనీసం ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు.ఇక ఫైనల్ గా ఈసినిమా నుండి అప్డేట్ వస్తుంది.అయితే ఇది చిన్న అప్డేట్ కాదు.ఈనెల 20న ఎన్టీఆర్ తన బర్త్ డే జరుపుకోనున్నాడు.ఈ సందర్భంగా వార్ 2 నుండి అప్డేట్ రానుంది.ఈవిషయాన్ని హృతిక్ రోషన్ ఎక్స్ లో ప్రకటించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మే 20న ఏం రానుందో ఆలోచించు?నన్ను నమ్ము వార్ 2 నుండి ఏం వస్తుందో నీకు కూడా ఐడియా ఉండదు తారక్ అంటూ హృతిక్ ట్వీట్ చేశాడు.దీనికి ఎన్టీఆర్ రిప్లై ఇచ్చాడు. థాంక్యూ సార్…రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి నేను కూడా వేచి ఉండలేను కబీర్ అంటూ హృతిక్ ట్వీట్ ను కోట్ చేశాడు. ఎన్టీఆర్ బర్త్ డే రోజున వార్ 2 గ్లింప్స్ లేదా టీజర్ రిలీజ్ చేయనున్నారు.ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుండో వార్ 2 అప్డేట్ కోసం ఎదురుచూస్తూవస్తున్నారు.ఇక ఇప్పుడు స్వయంగా హృతిక్ రోషనే అప్డేట్ రానుందని చెప్పడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమా తెరకెక్కిస్తుండగా యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 14న ఈసినిమా హిందీ తోపాటు తెలుగు లో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ఉండడం తో వార్ 2 తెలుగు రైట్స్ కు ఫుల్ డిమాండ్ వుంది.
ఇక ఈనెల 20న ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీస్ నుండి కూడా అప్డేట్స్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు.అందులో ఎన్టీఆర్ నీల్ నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనుండగా దేవర 2 షూటింగ్ ఎప్పుడో చెప్పే ఛాన్స్ వుంది.ప్రస్తుతం ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ నీల్(వర్కింగ్ టైటిల్) చేస్తున్నాడు.రీసెంట్ గానే ఎన్టీఆర్ ఓ షెడ్యూల్ ను కంప్లీట్ చేశాడు. త్వరలోనే కర్ణాటక లో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా వచ్చే ఏడాది జూన్ 25న విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: