హరిహర వీరమల్లు.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

Team Hari Hara Veera Mallu Announced New Release Date

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పలు ప్రాజెక్టులలో ‘హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేసిన మేకర్స్ రెండు పాటలు రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు VFX పనుల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. జూన్ 12న ఈ చిత్రం థియేటర్లలోకి వస్తోంది. ఈ మేరకు నేడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే ఇంతకుముందు మే 9న విడుదలవుతుందని మేకర్స్ తెలిపినా.. షూటింగ్ లేట్ అవడంతో దాదాపు ఒక నెల ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ ప్రకటించడంతో పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కాగా ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, ‘బాహుబలి’ ఫేమ్ శ్రీనివాస్ మోహన్, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేస్తున్నారు.

ఇక ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.