ఈ సంవత్సరం భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘థగ్ లైఫ్’ ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీం ఇప్పుడు పూర్తి స్థాయి ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై క్యూరీయాసిటీని పెంచింది. ఆ తర్వాత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ ఘన విజయాన్ని సాధించింది. ఈ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు మూవీ టీం ఇప్పుడు ప్రమోషన్‌లకు స్పెషల్ ప్లాన్ రూపొందించింది. దీనిలో భాగంగా బిగ్ ఈవెంట్స్ నిర్వహించడానికి సిద్ధమవుతోంది.
ఈ క్రమంలో మే 17న థగ్ లైఫ్ ట్రైలర్ ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. మే 24న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఆడియో లాంచ్ జరగనుంది. మే 29న విశాఖపట్నంలో తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. అంతకుముందు, చెన్నైలోని సాయిరామ్ కాలేజీలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
మల్టీ స్టేట్స్ ప్రమోషన్‌లతో ‘థగ్ లైఫ్’ ని ట్రూ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలిపేందుకు టీమ్ కాంప్రమైజ్ కాకుండా అన్ని విధాలుగా కృషి చేస్తోంది. కాగా తెలుగులో కమల్ హాసన్‌కి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు ఆడియన్స్ అందరినీ కలవాలని కమలహాసన్ ఈ సినిమాని అగ్రెసివ్‌గా ప్రమోట్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్‌కి తెలుగులో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి, త్రిష ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. యంగ్ హీరోలు శింబు, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్, నాజర్, మరియు పాపులర్ మాలీవుడ్ యాక్టర్ జోజు జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.
మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్‌పై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్ మరియు శివ అనంత్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ సినిమాని సమర్పిస్తోంది. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు థగ్ లైఫ్ భారీగా విడుదల చేయబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: