శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ‘సింగిల్’. కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా నటించగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించాడు. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్లో వచ్చే కామెడీ సినిమాలో హైలైట్ అయ్యింది. టాప్ బ్యానర్ గీతా ఆర్ట్స్, కళ్యా ఫిలిమ్స్ నిర్మించగా.. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. మే 9న మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుని లాభాల్లోకి వచ్చేసింది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో మొత్తం 23.07 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను అందుకుంది. అంతేకాకుండా అటు నార్త్ అమెరికా సహా ఓవర్సీస్లో సైతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా సాగుతుంది. తాజాగా హాఫ్ మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసింది. ఇదే జోరు కొనసాగితే ఫుల్ రన్లో మిలియన్ డాలర్ క్లబ్లో చేరడం పక్కా. అయితే ఈ నెలలో చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాలేవీ విడుదలకాకపోవడం సింగిల్‌కు అడ్వాంటేజ్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: