నాని హిట్ 3 నిన్నటితో మొదటి వారం రన్ ను పూర్తి చేసుకుంది.మొదటి నాలుగు రోజులు బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగిచడంతో 100 కోట్లక్లబ్ లో చేరింది. ఇక ఆతరువాత వీక్ డేస్ లోకి ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించడం తో మొదటి వారం లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసి క్లీన్ హిట్ గా నిలిచింది.7రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 115కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.మరి ఫుల్ రన్ లో 150కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందో చూడాలి. నాని కేరీర్ లో ఇది 3వ 100కోట్ల సినిమా.ఇంతకుముందు దసరా,సరిపోదా శనివారంతో ఈ ఫీట్ సాధించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అటు నార్త్ అమెరికాలో ఈసినిమా 2 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.ఇప్పటికే అక్కడ బ్రేక్ ఈవెన్ కావడంతో లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.శైలేష్ కొలను తెరకెక్కించిన ఈసినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.నానితోకలిసి ప్రశాంతి తిపిర్నేని ఈసినిమాను నిర్మించారు.
ఇక నాని నెక్స్ట్ దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో ది ప్యారడైజ్ చేయనున్నాడని తెలిసిందే.ఈసినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.ఇందులో నాని డిఫ్రెంట్ గెటప్ లో కనిపించనున్నాడు.రీసెంట్ గా అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈసినిమాని నిర్మించనుండగా అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.వచ్చే ఏడాది మార్చి 26న ది ప్యారడైజ్ విడుదలకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























