మాస్ జాతరలో నా క్యారక్టర్ ఎలా ఉంటుందంటే?

Actor Naveen Chandra Reveals His Character in Raviteja's Mass Jathara

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ లో తన క్యారక్టర్ ఎలా ఉంటుందో తెలిపారు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర. ఇందులో ఆయన నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా తనకు మొదట సితార సంస్థ నుంచి కాల్ వచ్చిందని, రవితేజ గారి సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారక్టర్ ఉందని చెప్పారు. అయితే దీనిని రవితేజ గారే తనకు రిఫర్ చేశారని, ‘అరవింద్ సమేత’లో నా క్యారెక్టర్ ఎలా యూనిక్ గా ఉంటుందో.. అంతే యూనిక్ గా ఈ సినిమాలో పాత్ర కూడా ఉంటుందని, తన లుక్ కూడా చాలా వెరైటీగా వుంటుందని తెలిపారు నవీన్ చంద్ర.

ఇక ‘మనదే ఇదంతా’ అనే ఉపశీర్షికతో వస్తోన్న మాస్ జాతరలో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది రవితేజకు ఆయనకు 75వ చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హీరో రవితేజ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్‌, ఫస్ట్ సింగిల్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి

కాగా మాస్ జాతరలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్‌గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. సంగీతం భీమ్స్‌ సిసిరోలియో, విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.