కింగ్‌డమ్ రిలీజ్ డేట్ మారింది

Vijay Deverakonda's KINGDOM Release Date Changed

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్‌ ‘హృదయం లోపల’ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా కీలక అప్డేట్ అందించారు. కింగ్‌డమ్ విడుదల వాయిదా పడినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. జులై 4న ఈ సినిమా థియేటర్లలోకి వస్తున్నట్టు వెల్లడించారు. కాగా ఇంతకుముందు మే 30న విడుదల కానున్నట్టు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మేకర్స్ అనూహ్యంగా రిలీజ్ డేట్ మారినట్టు ప్రకటించడం విశేషం.

అయితే మరోవైపు నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘తమ్ముడు’ కూడా ఇదేరోజు విడుదలకానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు పోటీపడబోతున్నాయి. రెండింటిపై మంచి అంచనాలే ఉన్న నేపథ్యంలో ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు ఒకేరోజు విడుదల కానుండటం ఆసక్తి కలిగిస్తోంది. కాగా తమ్ముడులో ‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటి లయ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.