పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.ఇక ఈసినిమా షూటింగ్ ఎట్టకేలకు తిరిగి స్టార్ట్ అయ్యింది.రెండేళ్ల క్రితం సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకోగా రెండు రోజుల క్రితం బ్యాలెన్స్ షూట్ ప్రారంభమైంది.ఈరోజు పవన్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.దాంతో వీలైనంత తొందరగా ఈ షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు.కుదిరితే ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ కి కూడా డేట్స్ ఇచ్చినట్లు సమాచారం.జూన్ మూడో వారంలో ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కానుందట.హరీష్ శంకర్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా శ్రీ లీల ఓ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటివరకు 20శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈఏడాది షూటింగ్ కంప్లీట్ చేయాలనీ చూస్తున్నారు.వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: