లండన్ మ్యూజియంలో ఘనంగా రామ్‌ చరణ్‌ విగ్రహావిష్కరణ

Ram Charan and His Pet Dog Rhyme Make History at Madame Tussauds After Queen Elizabeth II

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం సాధించారు. లండన్ మేడమ్ టుసాడ్స్‌లో ఆయన తన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి కొలువుదీరారు. ఈ అరుదైన గౌరవం ఆయనను క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఐకానిక్ మ్యూజియంలో తమ పెంపుడు జంతువుతో నిలిచిన ఏకైక సెలబ్రిటీగా ఉన్నత స్థానంలో ఉంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఆవిష్కరణ ఎమోషనల్ మూమెంట్. లండన్ లో జరిగిన కార్యక్రమానికి రామ్ చరణ్ కుటుంబం, సన్నిహితుల హాజరయ్యారు. వాస్తవానికి, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రకటనను వాయిదా వేయాలని భావించారు. అయితే, శాంతి నెమ్మదిగా నెలకొని, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో, ఈ క్షణాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి ఇది సరైన సమయం అని కుటుంబం భావించింది.

2023 ఆస్కార్ అవార్డ్స్ లో నాటు నాటు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ పాటగా నిలిచి చరిత్ర సృష్టించిన సందర్భంలో రామ్ చరణ్ ధరించిన బ్లాక్ వెల్వెట్ బంద్‌గళా స్టయిల్‌లో మైనపు విగ్రహం వుండటం అదిరిపోయింది. ఈ విగ్రహం ఆయన విజయాన్ని మాత్రమే కాదు, ఆయన తన పెంపుడు జంతువుతో ఉన్న బంధాన్ని కూడా తెలియజేస్తుంది.

ఇక ఈ వేడుకలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి గారు భావోద్వేగంతో ప్రౌడ్ ఫాదర్‌గా మాట్లాడారు. రామ్ చరణ్ తల్లి సురేఖ గారు, భార్య ఉపాసన గారు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ విగ్రహం రామ్ చరణ్ స్టార్ డమ్‌కి, లెగసికి, మన జీవితాల్లో పెంపుడు జంతువుల ప్రత్యేకతకు గుర్తుగా నిలుస్తోంది.

కాగా ఫ్యాన్స్, విజిటర్స్ మే 19 వరకు లండన్‌లో ఈ విగ్రహాన్ని చూడవచ్చు. తర్వాత విగ్రహాన్ని ప్రదర్శన కోసం మేడమ్ టుసాడ్స్ సింగపూర్‌కి తరలిస్తారు. ఈ విగ్రహం అద్భుతంగా వుందనే ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ లవర్స్, మెగా అభిమానులు మ్యాసీవ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.