యంగ్ హీరో నాగశౌర్య అప్ కమింగ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్. ఈ మూవీకి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. నాగ శౌర్య క్యారెక్టర్ ఇంటెన్స్ నేచర్‌ని ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సైమల్టేనియస్‌గా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య జోడిగా విధి హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, శ్రీదేవి విజయ్ కుమార్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, మైమ్ గోపి, శివన్నారాయణ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పని చేస్తున్నారు. సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ ఈ సినిమాతో తెలుగులోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఆయన దీనికి అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్షన్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: