ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)ను ప్రేక్షకులను పరిచయం చేసిన ‘హను-మాన్’ పాన్-ఇండియా విజయం తర్వాత, ఈ ఫ్రాంచైజీలోని నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం దేశవ్యాప్తంగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు ప్రకటించిన మూడవ ప్రాజెక్ట్ ‘మహాకాళి’ PVCUలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. RKD స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘చావా’లో తన పవర్ ఫుల్ నటనతో చెరగని ముద్ర వేసిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా ఇటీవలే మహాకాళి తారాగణంలో చేరిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అతని సూపర్ హీరో యూనివర్స్‌కి కొత్త కోణాన్ని, డెప్త్ యాడ్ చేయబోతోంది. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘మహాకాళి’ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. పౌరాణిక ఇతివృత్తాలను వినూత్నమైన సూపర్ హీరో కథలతో బ్లెండ్ చేస్తుంది. కాగా ఈ సినిమాకి లేడీ డైరెక్టర్ పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రానికి సంబంధించి కీలక తారాగణం, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు సహా మరిన్ని వివరాలను త్వరలో రివీల్ చేయనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: