లావ‌ణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ డబ్బింగ్ ప్రారంభం

Lavanya Tripathi's Sathi Leelavathi Dubbing Begins

వైవిధ్య‌మైన పాత్రల‌తో క‌థానాయిక‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న లావ‌ణ్య త్రిపాఠి, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకు ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌’ (శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం మేక‌ర్స్ సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. వీలైనంత త్వర‌గా షూటింగ్ చేసి సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమానుబంధాలను తెలియ‌జేస్తూ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న‌ల్ అంశాల‌తో స‌తీ లీలావ‌తి సినిమాను రూపొందిస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.