డైరెక్టర్ లోకేష్ కనగరాజ్- సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమాపై తెలుగులో అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.దానికి కారణం ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండడమే.రీసెంట్ గా ఇందులో నుండి నాగ్ పిక్ ఒకటి బయటికి వచ్చింది. దాంతో సినిమాకు వున్న బజ్ పెరిగిపోయింది.అంతేకాదు రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ లోనూ నాగ్ బ్యాక్ షాట్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.కూలీలో నాగార్జున, సైమన్ పాత్ర చేస్తున్నాడు. సినిమాలో దాదాపు 30 నిమిషాలకు పైగా కనిపించనున్నాడట.సైమన్ రోల్ కు సంబంధించిన సన్నివేశాలు అన్ని చాలా బాగా వచ్చాయని ఇన్సైడ్ న్యూస్.నాగ్ ను ఇంతకు ముందెన్నడు చూడని రోల్ లో చూపిస్తున్నాడు లోకేష్.ఇక ఈ పాత్రతో పాటు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ పాత్ర కూడా బాగా వస్తుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాపై కోలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది.కూలీ ఫస్ట్ 1000 కోట్ల తమిళ సినిమా అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈసినిమాకు తమిళంలో ఎంత బజ్ వుందో మిగితా భాషల్లో కూడా అంతే హైప్ వుంది.తెలుగు థియేట్రికల్ రైట్స్ అయితే ఫుల్ డిమాండ్ వుంది.నిర్మాతలు 80 కోట్ల వరకు కోట్ చేస్తున్నారట.ఓ బడా నిర్మాణ సంస్థ ఈహక్కులను తీసుకోవడానికి రెడీ అవుతుంది.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.
కూలీలో నాగార్జున , సౌబిన్ షాహిర్ తోపాటు ఉపేంద్ర ,సత్యరాజ్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 14న రిలీజ్ కానుంది.అయితే అదే రోజున హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల వార్ 2 కూడా థియేటర్లలోకి వస్తుండడంతో తెలుగు,హిందీలో కూలీకి భారీ పోటీఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: