సింగిల్ రివ్యూ

single review in telugu

నటీనటులు : శ్రీ విష్ణు ,కేతిక శర్మ ,ఇవానా , వెన్నల కిషోర్
సినిమాటోగ్రఫీ : ఆర్ .వేల్రాజ్
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
దర్శకత్వం : కార్తీక్ రాజు
నిర్మాణం : గీతా ఆర్ట్స్, కళ్యా ఫిలిమ్స్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణుకి రొమాంటిక్ కామెడీ జోనర్ కంఫర్ట్ జోన్.ఈజోనర్ లో చేసినవన్నీ దాదాపుగా హిట్ అయ్యాయి.రీసెంట్ గా సామజవరగమన కూడా ఇదే జోనర్ లో రాగ శ్రీవిష్ణు కెరీర్ లో బిగెస్ట్ హిట్ అనిపించుకుంది.ఇక ఇదే జోనర్ లో శ్రీ విష్ణు ఇప్పుడు సింగిల్ చేశాడు.ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాకు హైప్ వచ్చింది.ముఖ్యంగా ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ బాగా వైరల్ అయ్యాయి. దాంతో సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.మరి సింగిల్ ఎలా వుంది ? శ్రీ విష్ణు కు హిట్ ఇచ్చిందో లేదో తెలుసుకుందాం.

కథ :

బ్యాంక్ ఉద్యోగి అయిన విజయ్ (శ్రీ విష్ణు ) తన లైఫ్ లోకి అమ్మాయి వస్తే బాగుంటుందనుకుంటుండగా పూర్వని చూసి ప్రేమలో పడతాడు.పూర్వ ని కూడా ప్రేమలో దింపడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ తను అసలు పట్టించుకోదు.మరోవైపు హరిణి ( ఇవానా ) విజయ్ ను చూసి ప్రేమలో పడుతుంది. అయితే విజయ్ , హరిణిని పట్టించుకోడు. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరికి ఏమైంది? ఇంతకీ విజయ్ పెళ్లి చేసుకున్నాడా లేక సింగిల్ గానే ఉన్నడా అనేది మిగితా కథ.

విశ్లేషణ :

కామెడీ ప్రధానంగా సాగే సినిమా ఇది.ఇలాంటి సినిమాలకు కథ పెద్దగా అవసరం లేదు.రైటింగ్ , సిచ్యువేషనల్ కామెడీ క్లిక్ అయితే చాలు సినిమా హిట్ అయినట్లే. సింగిల్ కూడా ఇదే కోవలో వెళ్ళింది.ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్ అనిపిస్తుంది.ఎస్ డి ఎఫ్ సి ఉద్యోగులుగా శ్రీ విష్ణు , వెన్నెల కిశోర్ చేసే కామెడీ అంత ఇంతా కాదు. వన్ లైనర్స్ బాగా పేలాయి.

ఇక సెకండ్ హాఫ్ కూడా బాగానే వర్క్ అవుట్ అయ్యింది. చివర్లో కొంచెం ల్యాగ్ అనిపించినా శ్రీ విష్ణు ట్రేడ్ మార్క్ కామెడీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. .ఇందులో సోషల్ మీడియా మీమ్స్, రెఫెరెన్సులు కూడా బాగానే వాడుకున్నారు.ప్రమోషన్స్ లో చెప్పినట్లు కేవలం కామెడీ కోసమే చూసే సినిమా ఇది.ఈజీగా టైం పాస్ చేయిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే శ్రీ విష్ణు అదరగొట్టాడు.తనకు అలవాటైన పాత్రలో ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు.ముఖ్యంగా తన టైమింగ్ సూపర్.ఇక శ్రీ విష్ణు తరువాత సినిమాలో హైలైట్ అయ్యింది వెన్నెల కిషోర్.వీరిద్దరి కలిసి చేసిన కామెడీ సినిమాను నిలబెట్టింది.హీరోయిన్లుగా నటించిన కేతిక శర్మ ,ఇవానా కు మంచి పాత్రలు దక్కాయి.స్క్రీన్ మీద ఇద్దరు గ్లామర్ గా కనిపించారు.మిగితా పాత్రల్లో నటించిన వీటివీ గణేష్ ,ప్రభాస్ శ్రీను తమ పాత్రల్లో బాగా చేశారు.

టెక్నికల్ గా సినిమా ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ షార్ప్ గా వుంది.కేవలం 2 గంటల రన్ టైం సినిమా కు కలిసొచ్చింది.సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.విజువల్స్ రిచ్ గా వున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం డీసెంట్ గా వుంది.నేపథ్య సంగీతం కూడా ఓకే. నిర్మాతలు కథకు తగ్గట్లు నిర్మించారు.

ఓవరాల్ గా మంచి అంచనాలతో వచ్చిన సింగిల్ ఆ అంచనాలను అందుకుందని చెప్పొచ్చు.శ్రీ విష్ణు నుండి ఏం ఆశించి థియేటర్ కు వెళ్తామో ఆ విషయంలో ఎక్కడా డిసప్పాయింట్ అవ్వరు.శ్రీ విష్ణు ,వెన్నెల కిషోర్ కామెడీ సినిమాలో హైలైట్ అయ్యింది.ఈ సింగిల్ సమ్మర్ కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.