గత వారం తెలుగులో హిట్ 3 రిలీజ్ కాగా హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లు కళకళలాడాయి.ఈసినిమా 100కోట్ల పైనే వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ విజయం వైపు దూసుకుపోతుంది. ఇక ఈశుక్ర వారం మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో అన్ని చిన్న సినిమాలే అయినా ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.ఇంతకీ అవేంటంటే సింగిల్ ,బ్లైండ్ స్పాట్ ,శుభం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో శ్రీ విష్ణు నటించిన సింగిల్ కి ఎక్కువ బజ్ వుంది.శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్ లో సినిమా చేయడం అలాగే టాప్ బ్యానర్ గీతా ఆర్ట్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో సింగిల్ పై అంచనాలు వున్నాయి. ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈసినిమాలో కేతిక శర్మ , ఇవానా హీరోయిన్లు గా నటించగా కార్తీక్ రాజు తెరకెక్కించాడు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వస్తుంది.
ఇక నవీన్ చంద్ర బ్లైండ్ స్పాట్ కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది. ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు.కేవలం గంటన్నర రన్ టైంతో థియేటర్లలోకి రానుంది.కొత్త దర్శకుడు రాకేష్ వర్మ ఈసినిమాను డైరెక్ట్ చేయగా రామ్ వీరపనేని నిర్మించారు.
శుభం విషయానికి వస్తే ప్రముఖ హీరోయిన్ సమంత ఈసినిమాకు నిర్మాత కావడంతో హైప్ వచ్చింది.ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈసినిమాను డైరెక్ట్ చేయగా హర్షిత్ , శ్రీనివాస్ గవిరెడ్డి ,శ్రీయ కొంతం లీడ్ రోల్స్ లో నటించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























