హాలీవుడ్ మూవీస్ రేంజ్‌లో బ్లైండ్ స్పాట్ మ్యూజిక్

Blind Spot To Have Top Notch Music By Sriram Madduri

నవీన్ చంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘బ్లైండ్ స్పాట్’. యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాకేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, థియేట్రికల్ ట్రైలర్ మరియు ‘కనిపించేవన్నీ’ లిరికల్ వీడియో సాంగ్‌.. సినిమాపై అంచనాలు పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 9న ప్రేక్షకుల థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీకి అతితక్కువ రన్ టైం లాక్ చేశారు మేకర్స్. ఎండ్ టైటిల్స్‌తో కలుపుకుని మొత్తం 1గం 31ని.ల రన్ టైంని ఫిక్స్ చేశారు. బ్లైండ్ స్పాట్ పక్కా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫార్మాట్‌లో రూపొందింది. ఈ తరహా సినిమాలకు సంగీతం ఎంత ముఖ్యమో తెలిసిందే. అందుకే మేకర్స్ ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్ శ్రీరామ్ మద్దూరికి మ్యూజిక బాధ్యతలు అప్పగించారు.

వారి అంచనాలకు తగ్గట్టే ఆయన ఈ మూవీకి అద్భుతమైన సంగీతం అందించారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన బ్లైండ్ స్పాట్‌ థియేట్రికల్ ట్రైలర్ గమనిస్తే ఇది అర్ధమవుతుంది. స్టార్టింగ్ నుంచీ ఎండింగ్ వరకూ ఉత్కంఠగా సాగిన ఈ ట్రైలర్‌లో మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాపై క్యూరియాసిటీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.

అయితే శ్రీరామ్ మద్దూరి తెలుగువాడు అయినప్పటికీ ఆయన ఇంతకుముందు పలు హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన సంగతి ఎక్కువమందికి తెలియకపోవచ్చు. ‘ఎఫ్‌బీఐ, యూరోవిజన్, ద ఎడ్జ్ ఆఫ్ సెవెంటీన్, మారటోరియం, 4th పారడాక్స్, మ్యాడ్ నెస్’ వంటి సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించారు. ఇంత ఎక్స్‌పీరియెన్స్‌ ఉన్న శ్రీరామ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ అందించనుంది.

బ్లైండ్ స్పాట్‌లో రాశి సింగ్ హీరోయిన్‌గా నటించగా.. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక పేడాడ, హర్ష రోషన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దర్శన్ ఎమ్ అంబట్ సినిమాటోగ్రఫీ, సత్య. జి ఎడిటింగ్ నిర్వహించారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.