కంగువా తరువాత స్టార్ హీరో సూర్య రెట్రోతో వస్తున్నాడు.రేపే పాన్ ఇండియా రిలీజ్ కానుంది.ఇక తమిళంలో ఈసినిమా బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ అనేలా వున్నాయి.చెన్నైలో మొదటి రోజు అన్ని షోస్ దాదాపుగా ఫుల్ అయ్యాయి హిట్ టాక్ వస్తే కంగువా ఓపెనింగ్స్ ను బీట్ చేసే ఛాన్స్ వుంది. తెలుగులో ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదలచేస్తుంది. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు.అయితే రేపు నాని హిట్ 3 కూడా రిలీజ్ అవుతుండడంతో రెట్రోకి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీఎదురు కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈసినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.దాదాపు 2 గంటల 48నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.
ఇక సూర్య ప్రస్తుతం తన 45వ సినిమాలో నటిస్తున్నాడు.ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటిస్తుంది.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుండగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకార్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఇది సెట్స్ మీద ఉండగానే సూర్య నెక్స్ట్ సినిమాను కూడా మొదలు పెట్టనున్నాడు.అందులో భాగంగా తన 46వ సినిమాను తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి తో చేయనున్నాడు.మే నుండి షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























