కింగ్‌డమ్.. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ ఇచ్చిన అనిరుధ్

Anirudh Ravichander Gives Interesting Update on Vijay Deverakonda's Kingdom

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వీటిలో ప్రస్తుతం ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కింగ్‌డమ్’ సెట్స్ పైన ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ టీజర్‌కి వివిధ భాషల్లో పలువురు స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇవ్వగా.. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గాత్రం అందించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సమ్మర్ కానుకగా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కింగ్‌డమ్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా త్వరలో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టు ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చారు. దీంతో విజయ్ అభిమానులు దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక గత కొన్నేళ్లుగా అనిరుధ్ తన అద్భుతమైన సంగీతంతో మ్యూజిక్ లవర్స్‌నే కాకుండా మూవీ లవర్స్‌ని సైతం అలరిస్తున్నారు.

కొన్ని సినిమాలు కేవలం అనిరుధ్ మ్యూజిక్ వల్లనే హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని సినీప్రియులు అంటుంటారు. బీజీఎమ్ ఒక్కటే కాకుండా సాంగ్స్‌లో కూడా అనిరుధ్ మ్యాజిక్ కనిపిస్తుంది. ఈ క్రమంలో కింగ్‌డమ్ పాటలపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఇవి ఎలా ఉండబోతున్నాయి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.